Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కొత్త సావిత్రి కీర్తి సురేష్

కొత్త సావిత్రి కీర్తి సురేష్

జరుగు జరుగు ఇంకొకడు వస్తున్నాడు అన్న జోక్ లా తయారైంది సావిత్రి బయోపిక్ సినిమా. ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి మంచి సినిమా అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ తరువాత ఈ సావిత్రిని తెరకెక్కిస్తా అని పట్టు పట్టుకుని కూర్చున్నారు. నిర్మాతలు ఆయన భార్య అండ్ కో నే.

అప్పటి నుంచీ సావిత్రి క్యారెక్టర్ కోసం వినిపించని పేర్లు లేవు. నిత్య మీనన్ నుంచి సమంత వరకు. కానీ పాపం, అన్నీ ఆదిలోనే ఎగిరిపోతున్నాయి. ఆఖరికి ఇప్పుడు వినిపిస్తున్న పేరు కీర్తి సురేష్.

ఇటీవల ఆ అమ్మాయి టైమ్ బాగుంది. తెలుగులో చేతినిండా సినిమాలే సినిమాలు. అన్నీ మంచి ప్రాజెక్టులే. మాంచి హీరోల సరసనే. మరి ఇలాంటి టైమ్ లో, ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రకు ఆమె సై అందని వార్తలు వినవస్తున్నాయి. మరి ఇదీ నిజమో, మరి కొన్నాళ్లలో మరో పేరు వినిపిస్తుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?