క్రిష్-బన్నీ కాంబినేషన్ త్వరలో

వేదం సినిమాను జనాలు ఇంకా మరచిపోలేదు. క్రిష్ కోసం ఆ సినిమాను ప్రత్యేకంగా ఇష్టపడి చేసాడు హీరో అల్లు అర్జున్. మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ కాలేదు. కానీ త్వరలో ఆ కాంబినేషన్ రిపీట్…

వేదం సినిమాను జనాలు ఇంకా మరచిపోలేదు. క్రిష్ కోసం ఆ సినిమాను ప్రత్యేకంగా ఇష్టపడి చేసాడు హీరో అల్లు అర్జున్. మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ కాలేదు. కానీ త్వరలో ఆ కాంబినేషన్ రిపీట్ అయ్యేలా వుంది.

ఇప్పటికే క్రిష్-రాజీవ్ రెడ్డి ఓ మాంచి లైన్ తో బన్నీని కలిసినట్లు తెలుస్తోంది. క్రిష్ అంటే బన్నీ కచ్చితంగా ఓకె అంటాడు. అందుకే అన్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం వేరే ప్రాజెక్టు మీద బిజీగా వున్న క్రిష్, త్వరలో బన్నీ స్క్రిప్ట్ ను ఫైనల్ చేస్తాడని వినికిడి. బన్నీ తరువాత సినిమాగా వుంటుందా? లేదా ఆ తరువాత వుంటుందా? అన్న లెక్కల సంగతి పక్కన పెడితే క్రిష్-బన్నీ-రాజీవ్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా మాత్రం 2018-19లో వుండే అవకాశం వుందని తెలుస్తోంది.

వైవిధ్యమైన సబ్జెక్ట్ లతో సినిమాలు చేసే క్రిష్ మరి ఈ సారి బన్నీకి ఏం లైన్ చేప్పారో? జోనర్ ఏమిటో తెలియాల్సి వుంది. అది ఏమైనా, ఎలాంటిదైనా కచ్చితంగా డిఫరెంట్ గా వుంటుందని మాత్రం అంచనా వేసుకోవచ్చు.