సుధీర్ వర్మ డైరక్షన్ అనగానే జనాలకు గుర్తుకువచ్చేది థ్రిల్లర్ జోనర్. కానీ అలాంటి డైరక్టర్ షాడో డైరక్షన్ చేస్తే ఎలా వుంటుంది? కిర్రాక్ పార్టీలా వుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో.
కిర్రాక్ పార్టీకి స్క్రీన్ ప్లే అందించింది సుధీర్ వర్మే అన్న సంగతి తెలిసిందే. సినిమాకు డైరక్షన్ చందు మొండేటి శిష్యుడు శరణ్. అయితే సినిమా షూట్ లో దాదాపు అధికభాగం సుధీర్ వర్మ పాల్గొన్నారని, కన్నడ కిర్రాక్ పార్టీని తన అభిరుచి మేరకు మార్చి స్క్రిన్ ప్లే అందించడంతో, దగ్గరుండి మిగిలిన వ్యవహారాలు కూడా నడిపించారని టాక్ వినిపిస్తోంది.
కిర్రాక్ పార్టీ ఫస్ట్ హాఫ్ హ్యాపీడేస్ సినిమా మాదిరిగా కాలేజ్ ఫన్, సరదాలు, యూత్ ఫుల్ గా వుంటుదట. కానీ మాంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చి, సెకండాఫ్ అర్జున్ రెడ్డి మాదిరిగా మారుతుందని టాక్ వినిపిస్తోంది. నిఖిల్ కూడా గెడ్డంతో కనిపిస్తూ, కాస్త ఆడ్ గా బిహేవ్ చేస్తుంటాడట.
మొత్తం మీద ఇటు చందు మొండేటి, అటు సుధీర్ వర్మ చెరో పక్క సాయం పట్టిన కిర్రాక్ పార్టీకి టైమ్ బాగానే కలసివస్తోంది. థియేటర్ల బంద్ తో జనాలు సినిమాలకు మొహంవాచి వుంటారు. రెండు వారాల పాటు. అలాంటి టైమ్ లో జనాల ముందుకు దాదాపు పోటీ అన్నది లేకుండానే వస్తోంది కిర్రాక్ పార్టీ. అందువల్ల మాంచి ఓపెనింగ్స్ అయితే గ్యారంటీ.