కోనవెంకట్ ‘మిలియనీర్’

టాలీవుడ్ఇండస్ట్రీలో దర్శకుడు, రచయిత, నిర్మాత కోనవెంకట్ ది ఓ భిన్నమైన దారి. ఆయన ఇప్పడు ప్రాజెక్ట్ ల సెట్టింగ్ లు అనే కోత్త తరహా క్రాఫ్ట్ లో స్పెషలిస్ట్ అయిపోయారు. ఎవరో అనామకులు కథ…

టాలీవుడ్ఇండస్ట్రీలో దర్శకుడు, రచయిత, నిర్మాత కోనవెంకట్ ది ఓ భిన్నమైన దారి. ఆయన ఇప్పడు ప్రాజెక్ట్ ల సెట్టింగ్ లు అనే కోత్త తరహా క్రాఫ్ట్ లో స్పెషలిస్ట్ అయిపోయారు. ఎవరో అనామకులు కథ చెబుతాం అంటే హీరోలు వినరు. ఏదో రిఫరెన్స్ వుండాలి. చాలా మంది రిఫరెన్స్ ఇస్తారు.

కానీ కోన వెంకట్ ది భిన్నమైన దారి. ఎక్కడ టాలెంట్ వుందో పట్టుకుంటారు. కథలు తయారుచేయిస్తారు, స్క్రిప్ట్ లు రూపొందిస్తారు. అప్పుడు హీరో దగ్గరకు ఆ డైరక్టర్ ను పంపించి ఓకె చేయించుకుంటారు.

కోన బ్యాకప్ వుంటుంది కాబట్టి హీరోలు కూడా పెద్దగా ముందు వెనుక ఆడరు. ఆ విధంగా ప్రాజెక్టు ఫైనల్ అవుతుంది. అప్పుడు నిర్మాతను కూడా కోనే సెట్ చేస్తారు.
ఇలా అంతా చేసినందుకు కోన కార్పొరేషన్ బ్యానర్ కు పార్టనర్ షిప్ లభిస్తుంది.

ఇదో కొత్త తరహా విద్య. ఇది కోనవెంకట్ కే సాధ్యమైంది. ఇప్పుడు అలా కొత్తగా సెట్ చేసుకన్న ప్రాజెక్ట్ కళ్యాణ్ రామ్ హీరోగా 'మిలీయనీర్'. ఇటీవలే ఒక కొత్త దర్శకుడితో భిన్నమైన కథ చెప్పించి, కళ్యాణ్ రామ్ తో ఓకె చేయించుకున్నాడు. ఎమ్ఎల్ఎ, నా నువ్వే సినిమాల తరువాత కళ్యాణ్ రామ్ చేసే సినిమా అదే. దాని తరువాతే పవన్ సాధినేని సినిమా.

మిలీయనీర్ గా కళ్యాణ్ రామ్ ను ఎలా చూపించబోతున్నాడో కోన వెంకట్ మరి.