పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో ఎఎమ్ రత్నం నిర్మించే సినిమాకు అన్నీ అవరోధాలే. ఇలా స్టార్ట్ చేసారు. అలా ఆగింది. ఇంతలో వకీల్ సాబ్ వచ్చి పడింది. ఆపై కరోనా వచ్చి లెగ్ బ్రేక్ వేసింది. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ సినిమా షూట్ లు ప్రారంభం అయ్యాయి. మొత్తానికి పవన్ మెల్లగా వకీల్ సాబ్ సెట్ మీదకు వచ్చారు. ఆపై అయ్యప్పన్ రీమేక్ కు రంగం సిద్దం అవుతోంది.
ఇలాంటి సమయంలో తన కోసం ఓ పదిరోజులు ఇవ్వమని దర్శకుడు క్రిష్ పదే పదే అడిగారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఓ సెట్ లో వర్క్ క్లోజ్ చేయాలని కోరారు. ఆఖరికి పవన్ కరుణించి డిసెంబర్ తొలివారంలో వకీల్ సాబ్ కు , ఆఖరు వారంలో క్రిష్ సినిమాకు డేట్ లు ఇచ్చారు.
కానీ ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడిందని తెలుస్తోంది. నాగబాబు కుమార్తె నీహారిక పెళ్లి డిసెంబర్ లో వుంది. దానికి కనుక పవన్ హాజరైతే వకీల్ సాబ్ షెడ్యూలు దెబ్బతింటుంది. అది వెనక్కు జరిపితే క్రిష్ సినిమాకు సమస్య వస్తుంది. అలా అని పెళ్లికి వెళ్లకుండా వుండాలా? స్వంత అన్నదమ్ముడు..కూతురు పెళ్లి.
ఇక లేదూ అంటే విజయవాడ-హైదరాబాద్ కు చార్టర్ ఫ్లయిట్ పెట్టి దిల్ రాజు షూటింగ్ చేయించినట్లు, రాజస్థానకు కూడా ప్రత్యేక ఫ్లయిట్ పెడతారేమో? చూడాలి.