విశాఖలో ఫ్యుజన్ ఫుడ్స్ హోటల్ ను ఖాళీ చేయించడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై ఆ పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ చర్యలను ఆక్షేపించేశారు! జగన్ ప్రభుత్వానికి మానవత్వం లేదని ఆయన దుమ్మెత్తి పోశారు.
తెలుగుదేశం సానుభూతి పరుడనే అక్కసుతోనే హర్షవర్దన్ కు చెందని హోటల్ ను ఖాళీ చేయించారని ఆయన ధ్వజమెత్తారు!
బహుశా మానవత్వం అంటే.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా తెలుగుదేశం హయాంలో జరిగిన లీజు ఒప్పందాలు, భూ ఆక్రమణలను క్రమబద్ధీకరించడం అని అచ్చెన్నవారు చెబుతున్నారు కాబోలు!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి చేసిన యువకుడు పని చేసింది ఫ్యుజన్ ఫుడ్స్ లోనే. దాని యజమాని హర్షవర్ధన్ తెలుగుదేశం పార్టీ నేత. ఇప్పుడు విషయం ఏమిటంటే.. లీజు ఒప్పందం గడువు పొడిగింపులో అక్రమాలు చోటు చేసుకోవడం పై స్పందిస్తూ విశాఖ అభివృద్ధి సంస్థ వీఎంఆర్డీఏ అధికారులు ఫ్యుజన్ ఫుడ్స్ శ్రీకన్య కంఫర్ట్స్ హోటల్ ను ఖాళీ చేయించారు.
గతంలో తీసుకున్న లీజుకు సంబంధించి గడువును పొడిగించడంలో అక్రమాలు జరిగాయని, దీని వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతోంది అనే అభియోగాలతో ఈ హోటల్ ను ఖాళీ చేయించారు. దీనిపై ఆ హోటల్ యజమాని హర్షవర్ధన్ అభ్యంతరం తెలిపాడు. అధికారుల కాళ్లపై పడి మరీ ఆయన హోటల్ ను తొలగించవద్దని కోరినట్టుగా తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేసి పెడుతూ ఉండటం గమనార్హం!
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో లీజు గడువు పొడిగింపులో అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే అప్పుడు లీజు గడువును పొడిగించిన అధికారులు ఇప్పుడు ఎలా హోటల్ ను తొలగిస్తారంటూ హర్షవర్ధన్ ప్రశ్నిస్తున్నారట! తనకు గతంలో ఇచ్చిన లీజు ప్రకారం కొనసాగించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారట! ఈ విషయంలో ఆయన
అధికారుల కాళ్లపై కూడా పడ్డారట.