దర్శకుడి అనిల్ రావిపూడికి ఓ మిత్రుడు వున్నారు. సాయి అనే ఆ మిత్రుడు అనిల్ కు స్క్రిప్ట్ వర్క్ లో సాయం పడతారు. సినిమాల షెడ్యూలులో సాయం చేస్తారు. తానో అసోసియేట్ గా వుంటారు. ఇప్పుడు ఆ మిత్రుడిని నిర్మాతను చేస్తున్నారు అనిల్ రావిపూడి.
తను స్క్రిప్ఠ్ అందించి, నిర్మాణ సహకారం అందిస్తూ 'గాలి సంపత్' అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్ మెంట్స్ అనే బ్యానర్ ను కూడా స్టార్ట్ చేసారు. ఈ బ్యానర్ కు అనిల్ రావిపూడి మరో మిత్రుడు, షైన్ ప్రొడక్షన్స్ సాహు కూడా జతకలిసారు.
గతంలో అలా ఎలా అనే సినిమాను అందించిన అనీష్ డైరక్ట్ చేయబోతున్నారు. తండ్రీ కొడుకుల మధ్య ఫన్, సెంటిమెంట్ ఆధారంగా తయారవుతున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్-శ్రీ విష్ణు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇమ్మీడియట్ గా సెట్ మీదకు వెళ్లి ఫాస్ట్ గా రెడీ కాబోతోందీ సినిమా.
అచ్చు రాజమణి సంగీతం అందించే ఈ సినిమాలో తనికెళ్ల, రఘుబాబు లాంటి మాంచి పాపులర్ నటులు అంతా వున్నారు.