బాహుబలి ఫస్ట్ పార్ట్ కు నూట ఇరవై కోట్లు. రెండో పార్ట్ కు కూడా దాదాపు అంతకు మించిన ఖర్చు. రుద్రమదేవికి ఎనభై కోట్ల వరకు ఖర్చు. కానీ గౌతమీ పుత్ర శాతకర్ణికి ఎందుకు కేవలం యాభై నుంచి అరవై కోట్ల ఖర్చు. పైగా సినిమా నిర్మాణ సమయం కూడా తక్కువ?
అంటే క్రిష్ చాలా తెలివిగా సినిమాను ప్లాన్ చేసారని తెలుస్తోంది. సాధారణంగా పీరియడ్ డ్రామా అనే సరికి భారీ సెట్ లు, బ్లూ మ్యాట్ లు చాలా అవసరం. బాహుబలి అయితే దాదాపు బ్లూ మ్యాట్ లేకుండా సీన్ అన్నదే లేదేమో? కానీ గౌతమీ పుత్ర శాతకర్ణిలో బ్లూ మ్యాట్ వాడింది చాలా అంటే చాలా తక్కువ అని తెలుస్తోంది. అలా అని సెట్ లు కూడా భారీగా ఏమీ వేయలేదట. మరేం చేసారు అంటే, చాలా తెలివిగా నాచురల్ లోకేషన్లను వాడేసుకున్నాడట.
విదేశాల్లోని పలు హిస్టారికల్ మాన్యుమెంట్స్ ను, కోటలను ఎక్కడిక్కడ సినిమాకు అనుగుణంగా వాడేసుకున్నారట. వాటిని సీన్లలో ఇమిడ్చినపుడు మాత్రం కాస్త విజువల్ ఎఫెక్ట్స్ జోడించేసారట. దాంతో చాలా సులువుగా పని జరిగిపోయిందట.
అదీ విషయం.