సినిమా పబ్లిసిటీకే కోట్లు కావాల్సి వస్తున్న రోజుల్లో కోటి రూపాయిల్లో సినిమా నిర్మాణమా అనుకోవచ్చు. కానీ మనసు పెడితే సాధ్యమవుతుంది. ఆ మధ్య పెళ్లిచూపులు సినిమాను 60 నుంచి 70 లక్షల్లో ఫినిష్ చేసారు. లేటెస్ట్ గా సుమంత్ నరుడా డోనరుడా సినిమాను కూడా కోటి రూపాయిల లోపు ఖర్చుతోనే ఫినిష్ చేసేసారని తెలుస్తోంది.
ఈ సినిమాకు హీరో సుమంత్ రెమ్యూనిరేషన్ తీసుకోలేదట. అలాగే అన్నపూర్ణ ఇన్ ఫా స్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా కొంత మేరకు వాడుకున్నారని టాక్. ఇవే సుమంత్ పెట్టుబడి అన్నమాట. మిగిలిన నిర్మాణ వ్యయం జస్ట్ కోటి రూపాయిల లోపేనట. దానిని నిర్మాతలు భరించారట.
అయితే పెళ్లి చూపులు సినిమా విషయంలో పబ్లిసిటీని కొత్త పుంతలు తొక్కించారు. నిర్మాణానికి ఎంత ఖర్చు చేసారో పబ్లిసిటీకి అంత ఖర్చు చేసి జనం దగ్గరకు సక్సెస్ ఫుల్ గా చేర్తారు. కానీ డోనరుడు సినిమా విషయంలో మాత్రం పబ్లిసిటీ దగ్గర కూడా అంతంత మాత్రంగానే వెళ్తున్నారు.