సుమంత్‌.. ఇక అంతేనా.?

టాలీవుడ్‌ హీరో సుమంత్‌, 'నరుడా డోనరుడా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. గతంలోనే సుమంత్‌కి పెళ్ళయ్యింది. కానీ, కొన్ని కారణాలతో ఆ వివాహం పెటాకులయ్యింది. సుమంత్‌ని పెళ్ళాడింది ఎవరో కాదు, 'తొలిప్రేమ'…

టాలీవుడ్‌ హీరో సుమంత్‌, 'నరుడా డోనరుడా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. గతంలోనే సుమంత్‌కి పెళ్ళయ్యింది. కానీ, కొన్ని కారణాలతో ఆ వివాహం పెటాకులయ్యింది. సుమంత్‌ని పెళ్ళాడింది ఎవరో కాదు, 'తొలిప్రేమ' ఫేం కీర్తి రెడ్డినే. మహేష్‌కి సోదరిగా 'అర్జున్‌' సినిమలోనూ నటించింది కీర్తి రెడ్డి. ఇక, కీర్తి రెడ్డితో వైవాహిక బంధం తెగిపోయాక, మళ్ళీ పెళ్ళి గురించిన ఆలోచనే చేయని సుమంత్‌, 'నరుడా డోనరుడా' సినిమా ప్రమోషన్‌ కోసం మీడియా ముందుకొచ్చినప్పుడు కీర్తి రెడ్డితో విడిపోవడంపై స్పందించాడు. 

కారణాలు చెప్పలేదుగానీ, కీర్తి రెడ్డితో విడిపోయాక ఇంకెవరినీ పెళ్ళి చేసుకోవాలన్పించలేదనీ, ఇంకోసారి పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనే తనకు రావడంలేదని స్పష్టతనిచ్చేశాడు సుమంత్‌. తెరపై ఎలాంటి పాత్రలు చేసినా, సుమంత్‌ బాగా సెన్సిటివ్‌. అందుకేనేమో, 'తొలిప్రేమ'ని అలాగే గుండెల్లో పదిలంగా వుంచేసుకున్నాడు. ఆ ప్రేమకు కీర్తి రెడ్డి దూరమైనా, ఆమె జ్ఞాపకాలతోనే సుమంత్‌ అలా వుండిపోయినట్టున్నాడు. 

ఎప్పుడూ పెళ్ళి – కీర్తిరెడ్డితో విడిపోవడం వంటి విషయాలపై స్పందించని సుమంత్‌, ఇప్పుడు స్పందించడం ఆసక్తికరమైన విషయమే. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, సుమంత్‌ మళ్లీ పెళ్ళి చేసుకోవాలని ఆకాంక్షించినా, ఈ విషయమై సుమంత్‌ని ఒప్పించేందుకు ఆయన ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నది టాలీవుడ్‌ వర్గాల్లో విన్పిస్తోన్న గాసిప్‌. 

పెళ్ళి సంగతుల్ని పక్కన పెడితే, ఇకపై రెగ్యులర్‌గా సినిమాల్లో కన్పిస్తానంటున్న సుమంత్‌, ఎక్కువగా ఎంటర్‌టైనింగ్‌ సబ్జెక్ట్స్‌ని ఎంపిక చేసుకుంటాననీ, ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాననీ, ఖచ్చితంగా ఒకటైతే తననుంచి ఏడాదికి వచ్చి తీరుతుందని సుమంత్‌ చెబుతున్నాడు.