రామ్ చరణ్ పక్కన రాశీఖన్నా అంటూ వార్తలు గుప్పుమన్నాయి. మైత్రీ మూవీస్ నిర్మాణంలో సుకుమార్ రూపొందించే సినిమాకు రాశీని ఫైనల్ చేసారన్నది ఆ వార్తల సారాంశం. కానీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నది వేరుగా వుంది. రాశీ ని ఎంపిక చేయలేదని, ఆ వార్తలు వాస్తవం కాదని తెలుస్తోంది.
నిజానికి రాశీఖన్నా కనుక ఎంపిక అయి వుంటే అది జాక్ పాట్ నే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమెకు టాప్ లీగ్ హీరోల పక్కన చాన్స్ రాలేదు. ఒక్కసారిగా రామ్ చరణ్ అందునా సుకుమార్ డైరక్షన్ లో అంటే అది భారీ ప్రమోషన్ కిందే లెక్క. కానీ సినిమా రేంజ్ ను దృష్టి లో వుంచుకుంటే రాశీని తీసుకుంటారా అన్నది అనుమానం.
విశ్వసనీయ వర్గాలు చెబుతున్నది కూడా ఇందుకు దగ్గరగానే వుంది. సుకుమార్ కథలోని హీరోయిన్ పాత్రకు రాశీ మ్యాచ్ కాదని యూనిట్ భావిస్తోందట. అలాగే ఇప్పటి దాకా హీరోయిన్ వ్యవహారం ఫైనల్ నే కాలేదని కూడా యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. రాశీని అనుకున్నా, ఆమె ఆ పాత్రకు సూట్ కాదని, నిర్ణయం వాయిదా వేసారని తెలుస్తోంది. వేరే పేర్లు ఇప్పుడు పరిశీలనలో వున్నాయట.