కృష్ణవంశీ మార్కు టీజర్

గోవిందుడు అందరి వాడేలే సినిమా టీజర్ విడుదలైంది. యంగ్ హీరోల మాస్ సినిమాల టీజర్ ల్లా ఎక్జయిటింగ్ గా లేదు. అయితే కృష్ణవంశీ మార్కు అడుగడుగునా కనిపించింది. రామ్ చరణ్ కు ఈ స్టయిల్…

గోవిందుడు అందరి వాడేలే సినిమా టీజర్ విడుదలైంది. యంగ్ హీరోల మాస్ సినిమాల టీజర్ ల్లా ఎక్జయిటింగ్ గా లేదు. అయితే కృష్ణవంశీ మార్కు అడుగడుగునా కనిపించింది. రామ్ చరణ్ కు ఈ స్టయిల్ కాస్త కొత్తగానే వుంది. 

రామ్ చరణ్ తప్పిస్తే, ఈ టీజర్ లో ఎవరికీ కొత్త లుక్ ఏమీ లేదు. ప్రకాష్ రాజ్, జయసుధ, కాజల్, శ్రీకాంత్ అందరి గెటప్ లు గతంలో చూసేసిన స్టయిలే. ఇక టీజర్ లో టేకింగ్ చూసినా గతంలో కృష్ణవంశీ సినిమాలు చాలానే కళ్ల ముందు మెదులుతాయి. 

పల్లెటూరు నేపథ్యం, ఉమ్మడి కుటుంబం వంటి వ్యవహారాలున్న చాలా సినిమాల్లో ఇలాంటి సీన్లు మన ప్రేక్షకులకు పరిచితమే. సినిమా రామ్ చరణ్ ది..టీజర్ లో అతగాడి లుక్ మాత్రమే కొత్తది. కృష్ణ వంశీ మార్కు ఫ్రేమింగ్ లో రామ్ చరణ్ ఫొటోపెట్టినట్లుంది. అంతే.​