శ్రీకాంత్ ను గోవిందుడు ఆదుకుంటాడా?

శ్రీకాంత్ …కింద నుంచి పైకి వచ్చినవాడు..చిన్న చిన్న పాత్రల నుంచి హీరోగా ఎదిగినవాడు..ఇన్ని ప్లాపులున్నా కూడా ఇంకా తనకంటూ కొన్ని సినిమాలు సెట్ లపై అలా వుంటూనే వస్తున్నాయి. మిడిల్ ఏజ్డ్ హీరోలు అందరికీ…

శ్రీకాంత్ …కింద నుంచి పైకి వచ్చినవాడు..చిన్న చిన్న పాత్రల నుంచి హీరోగా ఎదిగినవాడు..ఇన్ని ప్లాపులున్నా కూడా ఇంకా తనకంటూ కొన్ని సినిమాలు సెట్ లపై అలా వుంటూనే వస్తున్నాయి. మిడిల్ ఏజ్డ్ హీరోలు అందరికీ వస్తున్న సమస్యే శ్రీకాంత్ దీనూ. సరైన, అతగాడికి సూటైన కథ దొరకడం లేదు. అందుకే ప్రేక్షకులకు దూరమైపోతున్నాడు. 

అలాంటి సమయంలో ఇప్పుడు గోవిందుడు అందరి వాడేలే సినిమా వస్తోంది. హీరో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో మాంచి ప్రాధాన్యత వున్న పాత్ర చేస్తున్నాడు అని తెలుసు. ఈ రోజు విడుదల చేసిన స్టిల్స్ చూసాక శ్రీకాంత్ అభిమానులకు కాస్త హోప్ కనిపిస్తోంది. రామ్ చరణ్ తో పాటు కాస్త ఈక్వెల్ ప్రాధాన్యత వున్న పాత్ర అని స్టిల్స్ భరోసా ఇస్తున్నాయి. లెజెండ్ తో జగపతిబాబు కెరియర్ టర్నింగ్ ఇచ్చుకున్నట్లు, ఇప్పుడు శ్రీ కాంత్ కెరియర్ కూడా టర్నింగ్ ఇచ్చుకుంటుందా? చూడాలి.