సంపత్ నంది..కొన్నాళ్ల క్రితం ఎవరికీ తెలియని పేరు. కానీ ఒక్క హిట్ సినిమాతో లైఫ్ టర్న్ అయిపోయింది. నిజంగానే టర్న్ అయిపోయింది. ఏమయిందీ వేళ సినిమా తీసినపుడు కాంటెంపరరీగా యూత్ పుల్ గా వుందిని అనుకున్నారంతా..బట్ జస్ట్ ఓకె అని పాసు మార్కులు మాత్రం వేసారు. ఆ తరువాత రామ్ చరణ్ తో రచ్చ సినిమా చాన్స్ వచ్చినపుడు..ఇతగాడా..రామ్ చరణ్ తోనా..అనుకున్నారు. అప్పటికి రామ్ చరణ్ కూడా మాంచి హిట్ కోసం చూస్తున్నాడు. అలాంటి టైమ్ లో రచ్చ వచ్చింది. బాక్సాఫీసు దగ్గర రచ్చ రచ్చ చేసింది. సంపత్ నంది కెరియర్ ఫుల్ టర్న్ తిరిగేసింది. మాస్ సినిమా అంటే ఇలా వుండాలి…యువ మాస్ హీరోలను ఇలాగే ఎలివేట్ చేయాలి అన్న మాటలు వినిపించాయి ఈ సారి. ఆ వెంటనే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే డైరక్ట్ ఛేసే అవకాశం. సంపత్ అదృష్టానికి చాలా మంది అసూయపడ్డారు కూడా. కానీ అక్కడే లైఫ్ చిన్న టర్న్ తీసుకుంది మళ్లీ. కారణాలేవయితేనేం..పరిస్థితులు ఏవయితేనేం..ఆ ప్రాజెక్టు అలా అలా డిలే అవుతూ వస్తోంది. కానీ ధైర్యం కోల్పోలేదు..నమ్మకం సడలిపోలేదు. అలాగే వుండిపోయాడు రెండేళ్లకు పైగా.
కానీ అంతలోనే వున్న గ్యాప్ లో ఏదైనా చేద్దామనుకున్నాడు..మిత్రులతో కలిసి స్వంత సినిమాకు శ్రీకారం చుట్టేసాడు..అదే గాలిపటం. ఈ నెల 8న ఎగరబోతోంది.
ఈ సందర్భంగా గ్రేట్ ఆంధ్ర కాస్సేపు సరదాగా ముచ్చటించింది.
ఎలా వుంది టెన్షన్
టెన్షన్ గానే వుంది. తొలి ప్రయత్నం కదా..కానీ నమ్మకం వుంది. ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుందని. నూటికి నూరుశాతం
మాస్ మూవీ నుంచి మళ్లీ యూత్ ఫిల్మ్ కు
నేను మొదలయ్యింది ఇక్కడే కదా..నిర్మాతగా కూడా ఇక్కడే మొదలు అనుకోండి
ఇది యూత్ సినిమాలో అడ్వాన్స్ డ్ అనుకోవాలా?
కాస్త అలాగే వుంటుంది. బాలీవుడ్ లేటెస్ట్ యూత్ సినిమాలు ఎలా వుంటున్నాయి..అలా..అలా అని దేనికీ సిమిలారిటీ కానీ అనుకరణ కానీ కాదు.జెన్ నెక్ట్స్ సినిమా అనుకోండి
మరీ అడ్వాన్స్ అయితే మన ఆడియన్స్ రీచ్ కావాలి కదా
అదేమీ లేదు..కాన్సెప్ట్ క్లియర్ గా చెప్పడంలోవుంటుంది. వారికి రీచ్ కావడం, కాకపోవడం అన్నది.
మీ టార్గెట్ ఆడియన్స్ పూర్తిగా యూత్ నా..?
కచ్చితంగా. వారికి నచ్చితే రిపీటెడ్ గా వస్తారు.
కానీ బి సి సెంటర్లు..
అక్కడ కూడా యూత్ యూత్ నే కదా?
గబ్బర్ సింగ్ ప్రాజెక్టు సంగతులు
నాకు పూర్తి నమ్మకం వుంది. అంతకు మించి ఈ సమయంలో మరేమీ చెప్పను..
లిప్ టు లిప్ కిస్ అంటున్నారు..ఏ సర్టిఫికెట్ అంటున్నారు..అవన్నీ ఓపెనింగ్స్ కి ప్లస్ అవుతుందనుకుంటున్నారా?
సినిమా ప్రోమోలు, సినిమాలో కంటెంట్..ఇదే ఓపెనింగ్స్ కైనా, రన్నింగ్ కైనా..మిగిలిన వన్నీ ఏడెడ్ అడ్వాంటేజ్ లు మాత్రమే.
చిన్న సినిమాల పయనం కొనసాగిస్తారా?
తప్పకుండా..కానీ ఏది పడితే అది కాదు..నాకు మంచి స్క్రిప్ట్ రాసే థాట్ వచ్చినపుడు, మంచి స్క్రిప్ట్ తయారైనపుడు మాత్రమే.
బెస్టాఫ్ లక్
థాంక్యూ
-'చిత్ర'గుప్త