‘తూనీగ తూనీగ..’ అంటూ తెలుగులో ఆడిపాడిన బ్యూటీ రియా చక్రవర్తి, తాజాగా బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో ప్రేమలో పడిరదట. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్‌లో వున్నారంటూ బాలీవుడ్ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. వాస్తవానికి ఆదిత్య రాయ్ కపూర్‌కీ, బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్‌కీ మధ్య ఎఫైర్ నడుస్తోందని నిన్న మొన్నటిదాకా బాలీవుడ్‌లో గాసిప్స్ గుప్పుమన్నాయి.
అయితే, శ్రద్ధా కపూర్‌కి టాటా చెప్పేసి, ఆదిత్య రాయ్ కపూర్ కొత్త బ్యూటీ రియా చక్రవర్తితో చక్కర్లు కొడ్తున్నాడన్నది తాజాగా విన్పిస్తోన్న గాసిప్స్ సారాంశం. వీరిద్దరూ ఈ మధ్య బాలీవుడ్ సినీ జనం కంటపడకుండా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారట. కొందరు దర్శక నిర్మాతలకు రియా పేరుని ఆదిత్య సన్నిహితుల ద్వారా రికమెండ్ చేస్తున్నాడట కూడా.
రియా, ఆదిత్యల మధ్య ఎఫైర్ గురించి ఎన్ని గాసిప్స్ వస్తున్నా ఇద్దరూ ఈ విషయమై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. ‘నో’ అని చెప్పడంలేదు సరికదా, ‘నో కామెంట్’ అనేసి ఊరుకుంటున్నారు. అంటే ఇద్దరి మధ్యా ఏదో వున్నట్టే కదా.? అని బాలీవుడ్‌లో అంతా అనుకుంటున్నారట.