కుమారి 21 ఎఫ్ లో షాకింగ్ ట్విస్ట్

కుమారి 21ఎఫ్ సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. జనాలకు బాగానే పట్టింది. ట్రయిలర్ చూసి, జనం కథ ను చాలా వరకు ఊహించేసుకున్నారు. అల్ట్రా మోడరన్ అమ్మాయితో అమాయకపు కుర్రాడి ప్రేమ ప్రయాణం..తను ప్రేమించిన…

కుమారి 21ఎఫ్ సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. జనాలకు బాగానే పట్టింది. ట్రయిలర్ చూసి, జనం కథ ను చాలా వరకు ఊహించేసుకున్నారు. అల్ట్రా మోడరన్ అమ్మాయితో అమాయకపు కుర్రాడి ప్రేమ ప్రయాణం..తను ప్రేమించిన అమ్మాయి కుమారినా కాదా అన్న అనుమానం, దాని పర్యవసానంగా జరిగే సంఘటనలు అని జనం అంచనాలు కడుతున్నారు. 

అయితే  ట్రయిలర్ లో పోలీసులు, ఇంకా ఇతరత్రా వ్యవహారాలు కూడా కనిపించాయి. ఇక్కడే అసలు సిసలు ట్విస్ట్ వుందని బోగట్టా. పైగా ఆ ట్విస్ట్ చాలా షాకింగ్ గా కూడా వుంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ ట్విస్ట్ కూడా టాలీవుడ్ లో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. 

అయితే ఈ ట్విస్ట్ ఎక్కడ బయటకు వెళ్లిపోతుందో, అని యూనిట్ వర్గాలు కంగారు పడుతున్నాయట. అది బయటకు వస్తే సినిమాపై ఆసక్తి పూర్తిగా పడిపోతుందన్నది వాళ్ల ఆందోళన. కానీ టాలీవుడ్ లో ఒక్కసారి చిన్న తాడు బయటకు కనిపించాలే కానీ, దాచడం కష్టం. నేడో రేపో అది కూడా తేలసిపోతుందేమో?