ధనుష్‌ని చూస్తే హీరోలా అనిపించడు కానీ… అతనికి మాత్రమే సూటయ్యే టైలర్ మేడ్ క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. వాటినే జాగ్రత్తగా ఎంచుకుని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ధనుష్. ఇప్పుడతను నేషనల్ లెవల్ హీరో. ఇతను హీరోనా అనుకున్న వాడే ఇండియా లెవల్లో సక్సెస్ అయిపోయాడు. చాలా మంది హేమాహేమీలైన సౌత్ హీరోల వల్లే కాని ఫీట్ ఇది.
తమిళంలో ధనుష్ రేంజ్ ఇంకా విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ అంత లేదు. అలా అని ఇప్పుడు ధనుష్ రేంజ్ తక్కువేం కాదు. అతని సినిమాలు కన్సిస్టెంట్గా సక్సెస్ అవడమే కాదు ఏ సూపర్‌స్టార్ సినిమాలకి తీసిపోకుండా వసూళ్లు కూడా సాధిస్తున్నాయి. అతని తాజా చిత్రం ‘అనేగన్’ ఫస్ట్ వీకెండ్లోనే ముప్పయ్ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ధనుష్‌ని సరాసరి టాప్ లీగ్‌లో నిలబెట్టింది.
పెరిగిన తన స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తూనే తన లిమిటేషన్స్ ఏంటో తనకి తెలుసునని అంటున్నాడు ధనుష్. సక్సెస్‌లు వస్తున్నాయి కదా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్స్ చేయనని, తనకి సూటయ్యే పాత్రల్నే చేస్తుంటానని చెప్పాడు. రఘువరన్‌తో తెలుగులో చిన్న సైజ్ హిట్టు కొట్టిన ధనుష్ అనేకుడుతో ఇంకోసారి ఇక్కడ సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు.