టెంపర్ రైట్స్ సచిన్ జోషి దక్కించుకొన్నాడన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. సచిన్‌కి హీరోగా నిరూపించుకోవాలన్న ఆత్రుత చాలా ఎక్కువ. నాలుగైదు సినిమాలు చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. కానీ చేతి నిండా డబ్బులున్నాయ్. బండ్ల గణేష్ ని అడ్డు పెట్టుకొని నీ జతగా నీనుండాలి అనే సినిమా కూడా తీశాడు. డబ్బులన్నీ సచిన్‌వే. కాకపోతే పేరు మాత్రం గణేష్‌ది. ఆసినిమాతో సచిన్ కు కనీసం రూ.5 కోట్లు పోయాయి.
ఇప్పుడు టెంపర్ హక్కులు కైవసం చేసుకొన్నాడు సచిన్. ఇది కూడా గణేష్ వ్యూహంలో భాగమే అని తెలుస్తోంది. 'ఈ సినిమా హిందీలో నువ్వే చేయ్.. నీకైతేనే బాగుంటుంది..' అని ఉసిగొల్పి మరీ సచిన్‌కి ఈ రైట్స్ అప్పగించారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నమాట. గణేష్ మాటలకు పడిపోయిన సచిన్.. ఫ్యాన్స్ రైట్స్ చెల్లించి టెంపర్‌ని కొననేశాడని చెబుతున్నారు.
''టెంపర్ రైట్స్ కి హిందీ నుంచి గట్టి పోటీ ఉంది.. కానీ నీకే ఇస్తా.. తీసుకో'' అంటూ గణేష్… సచిన్‌ని టెమ్ట్ చేశాడని, దాంతో సచిన్ ఫ్యాన్సీరేటుకి టెంపర్ రైట్స్ కొనేశాడని చెప్పుకొంటున్నారు. మొత్తానికి టెంపర్ అంటగట్టిన బాపతే అన్నమాట. అయితే మరోపక్క టెంపర్ తెరవెనుక నిర్మాతను నేనే అన్నట్లు మాట్లాడుతున్నాడు సచిన్. అసలు గణేష్ కు సచిన్ కు తెరవెనుక లావాదేవీలు వున్నాయిని, అందుకే టెంపర్ హక్కులు అటు వెళ్లాయని మరో వెర్షన్. ఏది నిజమో?