ఈ గ్యాప్‌లో మరో సినిమా చుట్టేశాడు రాంగోపాల్ వర్మ. సినిమాకి 365డేస్ అని పేరు పెట్టాడు. బహుశా ఐదారు రోజుల్లో ఈ సినిమాని తీసేశాడమో. ఓ గరమ్ గరమ్ గీతాన్ని కూడా చూపించి.. వేడి పెంచేస్తున్నాడు. అన్నట్టు రామ్‌గోపాల్ వర్మ చాలా కాలం తరవాత తీర్చిదిద్దిన లవ్ స్టోరీ అంటూ ఊదరగొడుతున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా వర్మ తన సొంత అనుభవాల నుంచి పుట్టుకొచ్చిందట. పెళ్లి తరవాత ప్రేమ ఉంటుందా?? అనే కోణంలోంచి ఈ సినిమా సాగుతుంది. సాధారణంగా ప్రేమ, పెళ్లి.. ఈ విషయాలపై వర్మకు గొప్ప అభిప్రాయాలేం లేవు. కోరికలు తీర్చుకోవడానికే పెళ్లిళ్లు చేసుకొంటారన్న బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చే వర్మ.. ప్రేమ, పెళ్లి గురించి గొప్పగా తీస్తాడనుకోవడం అవివేకం.
ఈ సినిమాలోనూ చాలా బోల్డ్ సన్నివేశాలుంటాయట. అవన్నీ వర్మ స్వీయ అనుభవాలే అని పిల్మ్‌నగర్ టాక్. ప్రేమ, పెళ్లి.. ఈవిషయాలపై వర్మ ఓ సంచలనాత్మక స్టేట్‌మెంట్ ఈ సినిమా ద్వారా ఇవ్వబోతున్నడని తెలిసింది. మరి అదేంటో.. ఎంత గొప్పగా ఉంటాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.