ఎల్ ఎల్ పికి స్వస్తి?

ఎల్ ఎల్ పి అన్నది గత రెండేళ్లుగా టాలీవుడ్ లో ఓ సంచలనం. అది ప్రారంభమైన కొత్తలో నిర్మాతలు రెండు గ్రూపులుగా చీలిపోయారు కూడా. చాంబర్ వుండగా, వేరే దుకాణం అన్న విమర్శలు వినవచ్చాయి.…

ఎల్ ఎల్ పి అన్నది గత రెండేళ్లుగా టాలీవుడ్ లో ఓ సంచలనం. అది ప్రారంభమైన కొత్తలో నిర్మాతలు రెండు గ్రూపులుగా చీలిపోయారు కూడా. చాంబర్ వుండగా, వేరే దుకాణం అన్న విమర్శలు వినవచ్చాయి. విజువల్ మీడియాతో అగ్రిమెంట్లు పెట్టుకుని, ఎల్ ఎల్ పి ద్వారా ప్రకటనలు ఇస్తూ వచ్చారు. నిర్మాతలు చాలామంది ఎల్ ఎల్ పి ద్వారానే ప్రకటనలు ఇస్తూవచ్చారు.

ఈ మేరకు ఎల్ ఎల్ పికి కమిషన్ కూడా వచ్చేది. మధ్యలో ఎల్ ఎల్ పికి కమిషన్ ఏమిటన్న విమర్శలు మొదలయ్యాయి. ఖర్చులు వుంటాయి. మిగిలితే సభ్యులకే పంచుతామన్న సమాధానాలు కూడా వినిపించాయి. దిల్ రాజు లాంటి డిస్ట్రిబ్యూటర్ బ్యాకింగ్ వుండడంతో ఎల్ ఎల్ పి ఇప్పటిదాకా నిరాటంకంగా సాగింది. ఇదే సమయంలో మీడియాకు టాలీవుడ్ కు మధ్య ఈ ఎల్ ఎల్ పి కారణంగా పొరపచ్చాలు కూడా వచ్చాయి.

ఇదిలావుంటే ఇప్పుడు ఎల్ ఎల్ పి దుకాణం మూసేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎల్ ఎల్ పి వివిధ మీడియా సంస్థలకు భారీగా బకాయిలు పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దానివల్ల మీడియా సంస్థలు ఇక ప్రకటనలు ఎంటర్ టైన్ చేయలేమన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఇక నిర్మాతలు నేరుగానే ప్రకటనలు ఇచ్చుకోవాలి లేదా, చాంబర్ అగ్రిమెంట్ల ప్రకారం చేసుకోవాలి.

ఈ నేపథ్యంలో ఇక ఎల్ ఎల్ పి దుకాణం మూతపడుతుందని వినిపిస్తోంది. మరి నిజంగా ఎల్ ఎల్ పి మీడియా సంస్థలకు భారీగా బకాయిలు వుంటే, వాటి సంగతేమిటో తెలియాల్సి వుంది. 

తెలంగాణ ఓటరు నాడి… ముళ్లు ఎటువైపు తిరుగుతోంది?… చదవండి గ్రేట్ ఆంధ్ర పేపర్