హీరోగా సరైన హిట్ కొట్టలేక, సినిమాలు ఓపెనింగ్స్ లేక డిజాస్టర్ కావడంతో, సరైన టైమ్ లో సరైన నిర్ణయం తీసుకుని మళ్లీ కమెడియన్ గా మారాడు సునీల్. ఆ లైన్ లో మాంచి అవకాశాలు తలుపుతట్టాయి. వరుసగా చేతినిండా సినిమాలు వున్నాయి. ఆదాయం కూడా కమెడియన్ గా కూడా బాగానే వుంది.
కానీ సునీల్ కు ఇంకా హీరోగా హిట్ కొట్టితీరాలన్న కోరిక పోలేదని టాక్ వినిపిస్తోంది. రైటర్ వెలిగొండ శ్రీనివాస్ డైరక్షన్ తయారుచేసిన కథ విని ఓకె అన్నాడట. ఇప్పుడు నిర్మాత కోసం వెదుకులాట సాగుతోందని వినికిడి.
కానీ సమస్య ఏమిటంటే, సునీల్ ఇప్పుడు కోటి రూపాయలకో, కోటిలోపు రెమ్యూనిరేషన్ కో సినిమా చేయడు. కనీసం రెండుకోట్లు లేదా, దానికి దగ్గరగా వుంటుంది వ్వవహారం. పైగా నిర్మాణ వ్యయం. అంతాకలిపి ఆరేడు కోట్లకు పైమాటే.
అందుకే నిర్మాతల కోసం వెదుకులాట సాగుతోంది. అన్నీ బాగానే వున్నాయి. కానీ ఈ మధ్య అమర్ అక్బర్ ఆంధోని లో సునీల్ ను చూస్తే, తొలినాళ్లలో ఏ మేరకు లావుగా వుండేవాడో అలా కనిపించాడు. మరి మళ్లీ హీరో అంటే జిమ్ లో బాగా కష్టపడాలేమో?
తెలంగాణ ఓటరు నాడి… ముళ్లు ఎటువైపు తిరుగుతోంది?… చదవండి గ్రేట్ ఆంధ్ర పేపర్