తెలుగు హీరోయిన్ అంటే నార్త్ ఇండియన్, కాదంటే కేరళ కుట్టిలకు ప్రిఫరెన్స్. అయితే కాస్త హిట్ అందుకుంటే చాలు రేటు అరకోటి దాటుతుంది. అయితే కొత్త అమ్మాయిలకు మరీ కాదంటే పది, పదిహేను లక్షలు ఇస్తూవుంటారు. లేదూ అవకాశాల కోసం తిరిగే అమ్మాయిలతే తొలిసినిమా ఫ్రీగా చేసేస్తారు. కానీ పెద్ద బ్యానర్లు ఇలా ఫ్రీగా చేయించుకోవు.
కాస్త బాగున్న అమ్మాయిని తెచ్చి, ఎంతో కొంత ఇస్తారు. మాంచి హీరోయిన్లను పరిచయం చేస్తాడు అని పేరున్న తేజ తాజగా తన హోరాహోరీ కోసం దక్ష అనే ఓ ముంబాయి అమ్మాయిని పరిచయం చేస్తున్నాడు. ఫరవాలేదనే ఫేస్. తేజ సినిమా అంటేనే బడ్జెట్ లో వుంటుంది. తిరిగి రివర్స్ పెట్టుబడి వుంటుందని గుసగుసలు వున్నాయి.
అయితే ఇది నిర్మాత దామోదర ప్రసాద్ గారి సినిమా. ఆయన అసలే ఖర్చు తగ్గించే సిండికేట్ లో మెంబర్ కూడా. కానీ బ్యానర్ పెద్దదే. అందుకే ఉదారంగా, లక్ష రూపాయిలు ఇచ్చారంట హీరోయిన్ కు. స్టిల్స్ చూస్తుంటే, వర్షంలో వళ్లు దాచుకోకుండా కష్టపడినట్లే కనిపిస్తోంది. పాపం, తడిసి ముద్దయినందుకయినా ఈ లక్ష అవసరమే.