లక్ష్మీ మంచు ‘వేట’

వేట టైటిల్ ఎంత పవర్ ఫుల్ అన్నది అందరికీ తెలిసిందే. మెగాస్టార్ సినిమాల్లో అదో మైలురాయి లాంటిది. మళ్లీ ఆ టైటిల్ తో ఓ సినిమా తెలుగులో రాబోతోంది. సీనియర్ హీరో మోహన్ బాబు…

వేట టైటిల్ ఎంత పవర్ ఫుల్ అన్నది అందరికీ తెలిసిందే. మెగాస్టార్ సినిమాల్లో అదో మైలురాయి లాంటిది. మళ్లీ ఆ టైటిల్ తో ఓ సినిమా తెలుగులో రాబోతోంది. సీనియర్ హీరో మోహన్ బాబు తనయ, మంచు లక్ష్మి కీలకపాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రానికి వేట అనే టైటిల్ పెట్టే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. 

లక్ష్మి కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు గతంలో రాజమౌళి దగ్గర పనిచేసిన విజయ్ అనే కొత్త దర్శకుడు పని చేస్తున్నారు. ఈ హీరోయిన్ బేస్డ్ సినిమాకు వేట అనే టైటిల్ ఏప్ట్ గా వుంటుందని భావిస్తున్నారట.

ఈ సినిమా పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ జోనర్ కు సంబంధించినది. రేసీ స్క్రీన్ ప్లేతో ఫాస్ట్ ట్రాక్ లో వెళ్తుంది. అందుకే సబ్జెక్ట్ దృష్ట్యా, స్క్రీన్ ప్లే దృష్ట్యా ఆ టైటిల్ పక్కగా సూటవుతుందని భావిస్తున్నారట.