అన్యధా భావించరాదు. పవన్ కల్యాణ్ చిత్రం ఎగస్ట్రా ప్రదర్శనలు వేసుకోవడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏదో ఒకటీ అరా కాదు.. అర్ధరాత్రి గడచిన దగ్గరినుంచీ మళ్లీ ఉదయం మార్నింగ్ షోలు పడేవరకు టైమింగ్ తో సంబంధం లేకుండా ఎడాపెడా స్పెషల్ షోలు వేసేసుకోవడానికి అనుమతులు ఇచ్చేశారు.
మామూలుగా భారీ సినిమాల విడుదల సందర్భంలో.. విడుదలకు ముందు రోజు, విడుదల రోజున ఫ్యాన్స్ కోసం అర్ధరాత్రి స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వడం మామూలే. అయితే.. పవన్ కల్యాణ్ కు సర్కారు కాస్త ఎగస్ట్రా మేలు చేస్తోంది.
సినిమా విడుదల కాబోతున్న ఈనెల 10వ తేదీనుంచి.. 17వ తేదీ వరకు ఏకంగా వారం రోజుల పాటూ అర్ధరాత్రి 1గంట నుంచి మరునాటి ఉదయం 10గంటల వరకు నిరంతరాయంగా షోలు వేసుకోవచ్చునని ఏకంగా ఏడురోజుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే విశేషం.
ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి పవన్ కల్యాణ్ చిత్రం అజ్ఞాతవాసితో పాటూ.. నందమూరి బాలకృష్ణ చిత్రం ‘జై సింహా’ కూడా విడుదల అవుతోంది. ఈ రెండు భారీ చిత్రాల మధ్య పోటీ బాగానే ఉండగల నేపథ్యంలో పవన్ కల్యాణ్ చిత్రానికి కలెక్షన్ల పరంగా చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం ఎడ్వాంటేజీ అవుతుందని పలువురు భావిస్తున్నారు. అసలే ఈ చిత్రం బాలయ్య సినిమా కంటె రెండు రోజుల ముందే విడుదల అవుతోంది.
ఆ రకంగా ఓపెనింగ్ కలెక్షన్లకు ఢోకా ఉండదు. దానికి తోడు విడుదలైన థియేటర్లన్నింటిలో వారంరోజుల పాటూ ఇలా స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వడం అంటే… మొత్తంగా లాకులు ఎత్తేసినట్లే అని జనం అనుకుంటున్నారు.