cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

లారెన్స్ ఓల్డ్ గెటప్ తో కాంచన 3

లారెన్స్ ఓల్డ్ గెటప్ తో కాంచన 3

లారెన్స్ స్వయంగా అందించిన దెయ్యం సినిమాలు అన్నీ సూపర్ హిట్లే. అందులో కాంచన మరీ స్పెషల్. ఆ తరువాత కాంచన్ సీక్వెల్ మొదలై ఇప్పుడు మూడొ పార్ట్ వరకు వచ్చింది. దాదాపు తమిళ వెర్షన్ పూర్తి కావస్తున్న కాంచన త్రీ తెలుగు మోషన్ పోస్టర్ విడుదలతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

కాంచన 3 తెలుగు వెర్షన్ ను నిర్మాత టాగోర్ మధు అందిస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్ లో లారెన్స్ ఓల్డ్ గెటప్ లో కనిపించడం విశేషం. ఇప్పటి వరకు తను వేసిన అన్ని దెయ్యం సినిమాల్లో కన్నా డిఫరెంట్ గా కనిపించాడు లారెన్స్. 

జస్ట్ మోషన్ పోస్టర్ మాత్రమే కనుక అంతకన్నా విశేషాలు లేవు. అయితే ఈ మోషన్ పోస్టర్ కు కూడా బీభత్సమైన ఆర్ ఆర్ ను సమకూర్చడం విశేషం. ఈ పోస్టర్, ఈ మ్యూజిక్ అన్నీ కలిసి, సినిమా ఏ రేంజ్ హర్రర్ లో వుండబోతోందో క్లియర్ చేసాయి.