లీకులపై త్రివిక్రమ్ ముందు జాగ్రత్త?

అయ్యప్పన్ కోషియమ్ సినిమాను పవన్ దృష్టికి తీసుకెళ్లడం దగ్గర నుంచి ఆ సినిమాకు ఎవరెవరు పని చేయాలి? ఎవరెవర్ని తీసుకోవాలి? స్క్రిప్ట్ లో ఏ మార్పుచేయాలి? ఇలా ప్రతి ఒక్కటి దర్శకుడు త్రివిక్రమ్ కనుసన్నలలోనే…

అయ్యప్పన్ కోషియమ్ సినిమాను పవన్ దృష్టికి తీసుకెళ్లడం దగ్గర నుంచి ఆ సినిమాకు ఎవరెవరు పని చేయాలి? ఎవరెవర్ని తీసుకోవాలి? స్క్రిప్ట్ లో ఏ మార్పుచేయాలి? ఇలా ప్రతి ఒక్కటి దర్శకుడు త్రివిక్రమ్ కనుసన్నలలోనే జరుగుతున్నాయి.

రెండు రోజులకు ఒకసారి అయినా డైరక్టర్ సాగర్ వెళ్లి త్రివిక్రమ్ దగ్గర చేసిన హోమ్ వర్క్ మార్పులు చెప్పడం, సలహాలు సూచనలు తీసుకుని మళ్లీ రావడం ఇలా జరుగుతూ వస్తోంది. అయితే ఈ విషయాలన్నీ మీడియాలో లీకవుతున్నాయి. 

దీనిపై త్రివిక్రమ్ ఆరా తీసి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. డైరక్షన్ యూనిట్ లో వున్నవారికి ఈ మేరకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. జనాలకు నిర్మాత నుంచి కూడా ఈ లీకులపై గట్టి ఆదేశాలు ఇవ్వమని డైరక్టర్ సాగర్ కు చెప్పినట్లు తెలుస్తోంది.

ఎకె సినిమాకు త్రివిక్రమ్ చాలా మేజర్ ఛేంజెస్ చేసినట్లు, అవన్నీ బయటకు వస్తే రిజల్ట్ దెబ్బతింటుందని ఈ ఆదేశాలు జారీ చేసినట్ల బోగట్టా. కానీ సాగర్ డైరక్షన్ యూనిట్ లో వున్న కొందరి కారణంగా అన్నీ లీక్ అయిపోతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే అయ్యప్పన్ రీమేక్ కు కర్త, కర్మ, క్రియ అన్నీ త్రివిక్రమ్ నే అని వార్తలు తరచు వస్తుండడంతో, తనకు ఎక్కడ హైలైట్ కాదో అని తనను తాను ప్రమోట్ చేసుకునే ఆలోచనలో డైరక్టర్ సాగర్ వున్నట్లు బోగట్టా.

అచెన్న రిపేర్లు చెయ్యగలడా?