లయన్ సినిమా విడుదలపై ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోందన్నది స్పష్టంగా చెప్పాడానికే ఈ నెల 29న అంటే బుధవారం మీడియా మీట్ పెడుతున్నారట. సినిమాను ఆఘ మేఘాల మీద పూర్తి చేసారు. అయితే ఇంజినీర్ మధుసూదన రెడ్డి చనిపోవడంతో బ్రేక్ పడింది. అయినా కిందా మీదా పడి పూర్తి చేస్తున్నారు. ఒకటిన లేదా ఏడున ఎలాగైనా విడుదల కావాలని హీరో బాలకృష్ణ పట్టుదలగా వున్నారు.
దానికి తగినట్లే నిర్మాత, దర్శకులు కిందా మీదా అవుతున్నారు. మరి పనులు పూర్తయినట్లా? కానట్లా అన్నదానిపై ఎవరు పెదవి విప్పడం లేదు. ఇదిలా వుంటే బయ్యర్లకు మాత్రం 14 అని డేట్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో 1 , 7, 14 డేట్ల నడుమ లయన్ దోబూచులాడుతోంది. 1 వ తేదీ కష్టం కావచ్చు. కానీ 7, 14 ల్లో ఏదో ఒకటి ఖరారు అవుతుంటదంటున్నారు.