లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత కాస్త గ్యాప్ తీసుకువచ్చిన బాలకృష్ణ సినిమా లయన్ కు డీసెంట్ ఓపెనింగ్స్ దక్కాయి. తొలి రోజే అయిదున్నర కోట్లు కలెక్షన్లు వచ్చినట్ల తెలుస్తోంది. ఇందులో నైజాం కోటిన్నర వరకు షేర్ వచ్చింది.
వైజాగ్, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, గుంటూరు ఒక్కొక్కటి నలభై నుంచి నలభై అయిదు లక్షల మధ్యన షేర్ వచ్చింది. మిగిలిన ప్రాంతాలు అన్నీ కలిపి కోటిన్నర వరకు వచ్చిందంటున్నారు. తొలిసారి మల్టీ ఫ్లెక్స్ ల్లో కూడా బాలయ్య సినిమాకు తొలి రోజు డిమాండ్ కనిపించడం విశేషం.
సాధారణంగా బాలయ్య సినిమా లంటే బి సి సెంటర్లు, సింగిల్ థియేటర్లు హడావుడిగా వుంటాయి. ఈసారి ఆ హడావుడి మల్టీ ఫ్లెక్స్ లకు కూడా పాకింది. సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు మరీ భయంకరంగా డ్రాప్ అయిపోతాయని భయపడాల్సిన పనిలేదు అంటున్నారు ట్రేడ్ జనాలు.