ఎల్ ఎల్ పి అంటే..?

బీరువా సినిమా టైటిల్స్ పడుతూనే జనాలకు ఓ ప్రశ్న ఎదురైంది. ఉషా కిరణ్ మూవీస్ కు బదులు ఉషాకిరణ్ ఫిలింస్ అని వేసి, పక్కనే చిన్న అక్షరాలతో ఎల్ ఎల్ పి అన్న పేరు…

బీరువా సినిమా టైటిల్స్ పడుతూనే జనాలకు ఓ ప్రశ్న ఎదురైంది. ఉషా కిరణ్ మూవీస్ కు బదులు ఉషాకిరణ్ ఫిలింస్ అని వేసి, పక్కనే చిన్న అక్షరాలతో ఎల్ ఎల్ పి అన్న పేరు కనిపించింది. ఇదేమిటి అని సినిమాలు పరిశీలించే జనాలకు క్యూరియాసిటీ. ఎల్ టిడి అంటే లిమిటెడ్ అనుకోవచ్చు..కానీ ఈ ఎల్ ఎల్ పి అంటే ఏమిటి? పైగా ఉషాకిరణ్ ఫిలింస్ అనే ఈ కొత్త బ్యానర్ ఏమిటి అన్న అనుమానాలు మరికొన్ని. 

ఇంతకీ విషయం ఏమిటంటే. ఎల్ ఎల్ పి అంటే లిమిటెడ్ లయబులిటీ ప్రాజెక్ట్ అంట. వేరే సంస్థలతో కలిసి, సినిమాలు చేయడం కోసం ఈ కొత్త బ్యానర్ ను, ఈ కొత్త పదాన్ని తయారుచేసారట. త్వరలో రాజేంద్ర ప్రసాద్ తో మరో సినిమా కూడా ఇలాగే రాబోతోంది. 

ఇంతకీ బీరువా మంచి లాభాలే తెచ్చిందట. అన్ని ఏరియాలు నాన్ రిఫండ్ కు అమ్మారట. పైగా మూడు కోట్ల పైచిలుకు తక్కువ బడ్జెట్ తో కానిచ్చేసారు. టేబుల్ ప్రాఫిట్ కు అమ్మేసారు. మయూరి రిలీజ్ వంటివి పెట్టుకోకుండా.