Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లోఫర్ కు అమ్మకాల కష్టాలు?

లోఫర్ కు అమ్మకాల కష్టాలు?

పూరి సినిమాలు ఎంత వేగంగా తీస్తారో..ఒక్కోసారి అంత వేగంగానూ డబ్బాలు వెనక్కు వచ్చేస్తుంటాయి. దాంతో రాను రాను మార్కెట్ డౌన్ అవుతోంది. జ్యోతి లక్ష్మి సినిమాతో మరీ డౌన్ అయింది. అంతకు ముందు ఇద్దరమ్మాయిలతో..హార్ట్ ఎటాక్..టెంపర్..ఇవన్నీ కలెక్షన్ల పరంగా గొప్ప సినిమాలేమీ కావు. 

ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా కలిసి లోఫర్ మీద కనిపిస్తోందని వినికిడి. నైజాం అమ్మేసారు కానీ మిగిలిన ఏరియాల బేరాలు తెగడం లేదని వినికిడి. నిర్మాత సి కళ్యాణ్ చెబుతున్న రేట్లకు, పూరి సినిమాల మార్కెట్ కు మ్యాచ్ కావడం లేదట. పోనీ అలా అని తగ్గించి ఇచ్చేయడానికి కిట్టుబాటు కాదని భయం..మరోపక్క

ఇంకో ముచ్చట కూడా వుంది. ఈ సినిమాకు పూరి ఏకంగా తన పారితోషికంగా ఏడు కోట్లు అడగుతున్నాడని వినికిడి. సినిమాకు ముందు అయిదుకోట్లు అని ఓ మాటగా అనుకున్నారట. కానీ ఇప్పుడు పూర్తయి, ప్రొడక్టు బాగా వచ్చిందని, మంచి లాభాలు వస్తాయని, తనకు ఏడు ఇవ్వమని పూరి అడుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అందుకే హడావుడిగా కాస్త భారీగా అడియో ఫంక్షన్ నిర్వహించారు. అప్పుడయినా సినిమాకు హైప్ వచ్చి, అమ్మాకాలు షురూ అవుతాయని ఆశ అన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?