Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లోఫర్ కు పూరి పని చేయలేదా?

లోఫర్ కు పూరి పని చేయలేదా?

వరుణ్ తేజ-పూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా లోఫర్. అయితే ఈ సినిమా గురించి ఓ గమ్మత్తయిన విషయమై ఇప్పుడు గ్యాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు దర్శకుడు పూరి జగన్నాధ్ చూడలేదని వార్తలు వినిపిస్తున్నాయి. టాకీ పార్ట్ వరకు పనులు మాత్రం పూరి జగన్నాధ్ చూసాడట. 

వన్స్ షూటింగ్ అయిపోయాక, మరి పూరీ పనులు అన్నింటినీ తన సీనియర్ అసిస్టెంట్లకు అప్పగించేసాడని తెలుస్తోంది. ఈ విషయమై హీరో వరుణ్ తేజ కూడా మెల్లగా పూరి దగ్గర కదిపాడని వినికిడి.. దానికి పూరి... తన స్టయిల్ అంతేనని, పోకిరి కి కూడా ఇలాగే చేసానని అన్నాడట. 

దాంతో వరుణ్ తేజ మరి మాట్లాడలేదట. ఇంతకీ పూరి అచ్చం పోకిరి లాగే పనిచేసినా, ఫలితం మాత్రం లోఫర్ మాదిరిగా వచ్చింది. పాపం.. పూర్ కళ్యాణ్.. డబ్బులకు బదులు డబ్బాలు వెనక్కు వచ్చాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?