లవ్ స్టోరీకి క్రేజీ భారీ ఆఫర్

నైజాంలో 18 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించిన సినిమా ఫిదా. శేఖర్ కమ్ముల అందించిన ఈ సినిమా తరువాత వస్తున్న సినిమా లవ్ స్టోరీ. హీరోయిన్ సాయిపల్లవి మళ్లీ మ్యాజిక్ చేస్తుందని బజ్…

నైజాంలో 18 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించిన సినిమా ఫిదా. శేఖర్ కమ్ముల అందించిన ఈ సినిమా తరువాత వస్తున్న సినిమా లవ్ స్టోరీ. హీరోయిన్ సాయిపల్లవి మళ్లీ మ్యాజిక్ చేస్తుందని బజ్ వుంది.

చైతన్య హీరో. ఈ సినిమా నైజాం హక్కులు తనకు ఇస్తే 11 కోట్లు ఇస్తానని డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా నైజాం హక్కులు విక్రయించే ఉద్దేశం నిర్మాత సునీల్ నారంగ్ కు లేదు.

ఎందుకంటే ఆయనకే నైజాంలో మెజారిటీ థియేటర్లు వున్నాయి. డిస్ట్రిబ్యూషన్ వుంది. అందువల్ల బయటకు ఇచ్చే ఆలోచన లేదు. అయినా కూడా వరంగల్ శ్రీను ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అంతే కాదు, తన ప్లానింగ్ ప్రకారం  సినిమాను విడుదల చేస్తే మరో యాభై లక్షలు ఇస్తానని కూడా అన్నట్లు తెలుస్తోంది. ఈ టెంప్టింగ్ ఆఫర్ కు మరెవరైనా వెంటనే ఎస్ అని వుండేవారేమో? కానీ ఆసియన్ సునీల్ మాత్రం సున్నితంగా నో చెప్పినట్లు తెలుస్తోంది.

నువ్వు ఒడిపోతే పార్టీ మూసివేస్తావా !

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?