శేఖర్ కమ్ముల-నాగ్ చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల సినిమాలు అంటే అవి ఇచ్చే ఫీల్ నే వేరు. హ్యాపీడేస్ నుంచి గోదావరి మీదుగా ఫిదా వరకు ఆయన ఇచ్చిన సినిమాలకు ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ వుంటుంది. ఇప్పుడు వస్తున్న లవ్ స్టోరీ టీజర్ కు కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అన్నది లేటెస్ట్ డిస్కషన్ పాయింట్. ఏప్రియల్ 14 లేదా 16 అంటూ డేట్ ఒకటి చిరకాలంగా వినిపిస్తోంది. కానీ ఈ డేట్ కు ఆ సినిమా రాదు అని, రావడం అనుమానం అని ఇప్పుడు టాక్. అందకే సమ్మర్ లో కీలకమైన ఆ డేట్ ను ఖాళీగా వదిలేయకుండా అందుకోవాలని మరి కొన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నాయి.
శేఖర్ కమ్ముల సినిమా షెడ్యూలు ప్రస్తుతం కాస్త వెనక్కే నడుస్తోంది. ఆర్మూర్ షెడ్యూలు డిలే గా పూర్తయింది. హైదరాబాద్ షెడ్యూలు ఓ వారం వుంది. అది అయిన తరువాత దుబాయ్ షెడ్యూలు వుంది. మూడు పాటల షూట్ వుంది. ఇవన్నీ మార్చి లోపు పూర్తయిపోవాలి. లేదూ అంటే ఏప్రియల్ లో అనుకున్న డేట్ కు రావడం కష్టం. అదీ కాక శేఖర్ కమ్ముల తానే దగ్గర వుండి ఎడిటింగ్, డబ్బింగ్ అన్నీ తానే చూసుకుంటారు. అందువల్ల టైమ్ పడుతుంది.
ఇలాంటి నేపథ్యంలో గీతా 2 సంస్థ అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో నిర్మించే బ్యాచులర్ సినిమాను చకచకా రెడీ చేసి ఆ డేట్ ను అందుకోవాలని చూస్తున్నారు. అయితే ఆ సినిమా వర్క్ కూడా ఇంకా చాలా వుంది. సెకండాఫ్ మొత్తం షూట్ బకాయి వుంది. అయినా ఎప్పుడయితే లవ్ స్టోరీ రాదు అన్న టాక్ బయలుదేరిందో, బ్యాచులర్ ను రెడీ చేయాలన్న ప్రయత్నాలు ప్రారంభమైనట్లు బోగట్టా.