లూసిఫర్ కు గ్రీన్ సిగ్నల్

లూసిఫర్ నా? వేదాళం నా? ఏది ముందు అన్నది మెగా సందేహంగా గత కొంత కాలంగా వినిపిస్తోంది. ఆఖరికి ఇప్పటికి ఆ సందేహం తీరిపోయింది.  Advertisement జనవరి నుంచి లూసిఫర్ నే ముందుగా సెట్…

లూసిఫర్ నా? వేదాళం నా? ఏది ముందు అన్నది మెగా సందేహంగా గత కొంత కాలంగా వినిపిస్తోంది. ఆఖరికి ఇప్పటికి ఆ సందేహం తీరిపోయింది. 

జనవరి నుంచి లూసిఫర్ నే ముందుగా సెట్ మీదకు వెళ్తోంది. ఈ సినిమాను జనవరి నుంచి సెట్ మీదకు తీసుకెళ్లాలని మెగాస్టార్ నిర్ణయించారు. సమ్మర్ టైమ్ నుంచి వేదాళం రీమేక్ వుంటుంది. 

తెలుగువారికి పరిచయం అయిన ఎడిటర్ మోహన్ కుమారుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడు. ఇతగాడు కూడా తెలుగువారికి పరిచయమే. హనుమాన్ జంక్షన్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి తమళనాటకు వెళ్లిపోయాడు. తరువాత సమ్ థింగ్..సమ్ థింగ్ సినిమా కూడా అందించాడు

రామ్ చరణ్ బాగా ఇంప్రెస్ అయిన సినిమా లూసిఫర్. రామ్ చరణ్ నే పూనుకుని నిర్మాత ఎన్వీ ప్రసాద్ చేత కొనిపించారు. అందుకే ఎలాగైనా ఆ సినిమాను ముందుగా పూర్తి చేయాలని రామ్ చరణ్ పట్టుపట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కాస్టింగ్ వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా ఏవీ ఫిక్స్ కాలేదు. 

ఈ సినిమాను మార్చి నెలాఖరుకు పూర్తి చేసేయాలనే సంకల్పంతో వున్నారు. ఆచార్య లో మెగా స్టార్ వర్క్ డిసెంబర్ నెలాఖరుకు పూర్తయిపోతుంది. చరణ్ ఆచార్య సెట్ మీదకు ఫిబ్రవరి చివర్లో జాయిన్ అయ్యే అవకాశం వుంది.

బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌రో నాకు తెలుసు