నిర్మాత దిల్ రాజు అమితంగా నమ్ముతున్న, ఇష్టపడుతున్న ప్రాజెక్టు ఎఫ్ 3. ఈ సినిమా కోసం దిల్ రాజు భారీగా రెమ్యూరేషన్లు ఇస్తున్నారని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.
ఈ ఫిగర్లు రకరకాలుగా వినిపిస్తున్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దిల్ రాజు ఓ టాప్ హీరోతో ఇటీవల ఈ విషయాలు పిచ్చాపాటీ ముచ్చట్లలో భాగంగాం షేర్ చేసుకున్నట్లు బోగట్టా. ఆ వివరాల ప్రకారం సినిమా రెమ్యూనిరేషన్లకే యాభై కోట్ల వరకు అయిపోతుందని తెలుస్తోంది.
హీరో వెంకీకి 12 కోట్లు, వరుణ్ కు 8 కోట్లు, తమన్నాకు రెండు కోట్లు, మెహరీన్ కు 70లక్షలు, కమెడియన్ సునీల్ కు 75 లక్షలు, దేవీశ్రీ ప్రసాద్ కు మూడు కోట్లు, డైరక్టర్ అనిల్ రావిపూడికి 12 కోట్లు ఇలా వున్నాయట రెమ్యూనిరేషన్లు.
ఇవి కాక వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి ఇంకా చాలా స్టార్ కాస్ట్ వుందట. యాక్టర్లు, టెక్నీషియన్లు కలిపి రెమ్యూనిరేషన్లే నలభై కోట్లు దాటేస్తాయని బోగట్టా.
షూటింగ్ డేస్ 60 నుంచి 70 రోజులు వుంటుందని, వడ్డీలు,పబ్లిసిటీ ఇలా అన్నీ కలిసి ముఫై కోట్ల వరకు ఖర్చు వుంటుందని తెలుస్తోంది. ఇలా అన్నీ కలిపి ఎఫ్ 3 బడ్జెట్ ను 70 నుంచి 80 కోట్ల వరకు చేరుస్తాయని బోగట్టా.