ఎంత ట్రయ్ చేస్తున్నా, సరైన హిట్ దొరక్క కిందా మీదా పడుతున్నాడు మధుర శ్రీధర్. మధ్య మధ్యలో సినిమా మీద ప్రేమతో పక్క చూపులు చూసి, చిన్న చిన్న వ్యవహారాలు కూడా చేస్తుంటాడు. అలాగే హోరా హోరీ సినిమాను ఓవర్ సీస్ లో విడుదల చేయాలని డిసైడ్ అయిపోయాడు.
దగ్గర దగ్గర పాతిక లక్షలకు ఓకె కూడా అయిపోయిందని వినికిడి. కానీ మళ్లీ ఏమనుకున్నాడో, ఏమో, కానీ వెనకడుగు వేసాడు. దాంతో నిర్మాతలు వేరే పార్టీని చూసుకునో, నేరుగానో ఓవర్ సీస్ కు వెళ్లారు. ఇప్పుడు సినిమాకు సరైన టాక్ రాలేదు. ఓవర్ సీస్ లో విడుదల చేయాలంటే కనీసం తక్కువలో తక్కువ పది, పదిహేను లక్షయినా ఖర్చు తప్పదు,. అంటే మధుర శ్రీధర్ తీసుకుని వుంటే, అంతా కలిపి నలభై లక్షలకు డేకేది పెట్టుబడి.
సినిమా ఈ టాక్ తో ఓవర్ సీస్ లో కనీసం లక్షడాలర్లు వసూలు చేస్తే తప్ప గట్టెక్కడం కష్టం. ఎందుకు వదిలేసాడో, మరేం జరిగిందో కానీ, మధుర శ్రీధర్ కు మంచే జరిగింది.