పాపం, ఏ ముహుర్తాన కథ రాసుకున్నారో దర్శకుడు అజయ్ భూపతి. మహా సముద్రం సినిమాకు అడుగు అడుగునా ఆటంకాలే. ఏదో సమస్య వస్తోంది. కానీ ఆయన మాత్రం ఆ కథనే ప్రేమిస్తూ, అదే తీయాలని పంతంగా వుండిపోయారు.
నిజానికి అజయ్ భూపతి దగ్గర మరో మంచి సబ్జెక్ట్ కూడా వుందని తెలుస్తోంది. కానీ ఆయన ముందుగా మహా సముద్రం సినిమానే తీయాలని పట్టుదలగా వున్నారు. లేటెస్ట్ గా హీరో శర్వానంద్ కు ఆ కథ పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. సితార బ్యానర్ లో నిర్మాణం రెడీ అనుకున్నారు. కానీ హీరోయిన్ గా సమంత ఓకె అనాల్సి వుంది.
అంతకు ముందు చైతూ హీరోగా అనుకున్నపుడు సమంత కథ వినడం, దాదాపు ఓకె అనడం అయిపోయింది. అందువల్ల శర్వాతో అయినా శామ్ ఒకె అంటుందనే అనుకున్నారు. ఇలాంటి టైమ్ లో జాను సినిమా వచ్చింది. టోటల్ డిస్సపాయింట్ మెంట్. దాంతో శామ్ మనసు మారిపోయిందని బోగట్టా.
మళ్లీ అదే హీరోతో చేసే మూడ్ లో ఆమె లేనట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు మహాసముద్రం సినిమాకు మరో హీరోయిన్ ను వెదకాలి. పెర్ ఫార్మెన్స్ కు అవకాశం వున్న పాత్ర. అంతే కాదు, మరో హీరో కూడా కావాలి. అది ఇంకా ఎర్లీ స్టేజ్ లోనే వుంది. ఈ రెండు ఫిక్స్ అయితే మహాసముద్రం ప్రాజెక్టులో కదలిక వస్తుంది.