ఇందులో పెద్దగా మతలబు ఏమీ లేదు. డ్రయివింగ్ లైసెన్స్ అంటే వెహికిల్ నడపడానికి కాదు. రీమేక్ చేయడానికి. విషయం ఏమిటంటే, ఈ మధ్య మలయాళంలో ఓ సినిమా పెద్ద హిట్ అయిపోయింది. ఆ సినిమా పేరే డ్రయివింగ్ లైసెన్స్. మలయాళంలో వైవిధ్యమైన సినిమాలు నిర్మించే హీరో పృధ్వీరాజ్ తన బ్యానర్ పై నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా మీద టాలీవుడ్ జనాల కళ్లు పడ్డాయి. చాలా మంది కొనాలనుకున్నారు. అమెజాన్ ప్రయిమ్ లో చాలా మంది చూసారు కూడా.
ఆఖరికి మెగా హీరో రామ్ చరణ్ ఈ సినిమా హక్కులు కొన్నారు. ఆయన దీన్ని తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మిస్తారు. అయితే ఇది వేరే హీరోలు ఎవరితో అయినా నిర్మించే అవకాశం వుందని తెలుస్తోంది.
ఓ సినిమా హీరోకి, అతని అభిమాని అయిన డ్రయివింగ్ లైసెన్స్ జారీ చేసే అధికారికి మధ్య వచ్చిన ఇగో క్లాష్ నేపథ్యంలో అల్లుకున్న కథతో ఈ సినిమా తయారైంది. దీనికి మంచి ఆదరణ లభించింది. అందుకే రామ్ చరణ్ ఈ సినిమాను కొన్నాడు. మిగిలిన మెగా హీరోల్లో ఎవరితో అయినా ఈ సినిమాను నిర్మించే అవకాశం వుందని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ లూసిఫర్ అనే మలయాళ సినిమా కూడా కొన్న సంగతి, దానికి దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ తయారుచేస్తున్న సంగతి తెలిసిందే.