దర్శకుడు వివి వినాయక్ కీలక పాత్రలో నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేసిన సినిమా శీనయ్య. సినిమాకు హీరో వివి వినాయక్ అన్న ప్రచారమే కానీ, ఆయనది ముఖ్యపాత్ర మాత్రమే. మరో యంగ్ హీరో కూడా కావాలి సినిమా. ఈ సినిమాకు ఏనాడో కొబ్బరికాయ కొట్టేసారు. ఈ సినిమా కోసం కసరత్తులు గట్రా చేసి వివి వినాయక్ చాలా వరకు ఫిజికల్ గా ఫిట్ గా తయారయ్యారు.
అంతా బాగానే వుంది కానీ ఇప్పటి వరకు సినిమా సెట్ మీదకు వెళ్లలేదు. ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టు వుంటుందా? వుండదా?అన్నది. ఇండస్ట్రీలో అయితే ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోయిందని వినిపిస్తోంది. సినిమాకు సెకండాఫ్ సరిగ్గా రెడీ కాలేదని, అందువల్ల ప్రాజెక్టును పక్కన పెట్టారని టాక్.
గతంలో ఈ సినిమాలో యంగ్ హీరో క్యారెక్టర్ కు నవీన్ చంద్రను తీసుకుంటున్నారని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మళ్లీ వేరే యంగ్ హీరో కోసం చూస్తున్నారని కూడా వినిపిస్తోంది. స్క్రిప్ట్ సెకండాఫ్ వర్క్ పూర్తిగా మారుస్తున్నారని, అది అయ్యాక కానీ స్టార్ కాస్ట్ అన్నది, అలాగే అసలు ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలా?వద్దా?అన్న విషయం డిసైడ్ కాదని తెలుస్తోంది.