మహానటి ధైర్యం ఏమిటి?

మహానటి, ఈ మధ్యకాలంలో హీరోయిజం సపోర్ట్ లేకుండా కాస్త ఆసక్తి రేకెత్తించిన సినిమా. బాహుబలి, రంగస్థలం, లాంటి సినిమాల తరువాత కాస్త గట్టి హోమ్ వర్క్ చేసి, కాస్త గట్టిగానే ఖర్చుచేసి నిర్మించిన పీరియాడిక్…

మహానటి, ఈ మధ్యకాలంలో హీరోయిజం సపోర్ట్ లేకుండా కాస్త ఆసక్తి రేకెత్తించిన సినిమా. బాహుబలి, రంగస్థలం, లాంటి సినిమాల తరువాత కాస్త గట్టి హోమ్ వర్క్ చేసి, కాస్త గట్టిగానే ఖర్చుచేసి నిర్మించిన పీరియాడిక్ బయోపిక్. ఈ సినిమాకు వున్న స్టార్ కాస్ట్ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్, సమంత. అంతే. ఇంకా చాలా పేర్లు వున్నా, అంతా గెస్ట్ ఆర్టిస్ట్ లే.

మూడు భాషల్లో క్రేజ్ వుంటుందని భావిస్తున్న ఈ సినిమాకు కాస్త తలకు మించి ఖర్చు చేసారు. 25నుంచి 27కోట్ల వరకు ఖర్చయిందని అంచనా. కానీ ఇప్పటి వరకు రికవరీ లేదు. ఎందుకంటే ఖర్చు వేరు. స్టార్ కాస్ట్ పట్టి మార్కెట్ వేరు.  అండర్ సేల్ చేయలేరు. అలా అని రేటు రాకుండా అమ్మలేరు. దీంతో మహానటి చాలా వరకు ఓన్ రిలీజ్ అవుతోంది.

కీలకమైన ఏరియాల్లో వైజాగ్ మాత్రం రెండు కోట్లకు అమ్మారు. అంటే దగ్గర దగ్గర ఆంధ్ర 8కోట్ల రేషియోలో అమ్మినట్లు. నెల్లూరు 60లక్షలకు అమ్మారు. అది కూడా రికవరబుల్ అన్న కండిషన్ మీద అమ్మినట్లు తెలుస్తోంది. మొత్తం మీద మరో ఒకటి రెండు ఏరియాలు మినహా మరేవీ అమ్మలేదు. కీలకమైన నైజాం ఏరియా, ఆంధ్రలో చాలా ఏరియాలు నిర్మాతల దగ్గరే వున్నాయి.

పైగా శాటిలైట్, డిజిటల్ అన్ని లాంగ్వేజెస్ కలిపి కూడా అమ్మలేదు. సినిమా విడుదల తరవాత అమ్ముతారా? ఈ లోగానే అగ్రిమెంట్ చేసుకుంటారా అన్నదాంట్లో క్లారిటీ లేదు. ఈ సేల్ మీద 20కోట్ల వరకు మహానటి నిర్మాతలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ రేంజ్ వస్తుందా అన్నది చూడాలి.

నిర్మాతలు, దర్శకుడు ఒక ఇంటివారే. వారంతా సినిమా మీద సూపర్ కాన్ఫిడెన్స్ తో వున్నారు. అందుకే తెగనమ్మకూడదని, దాదాపు 75పర్సంట్ ఓన్ రిలీజ్ వెళ్తున్నారు. శాటిలైట్ కూడా వుంచేసారు. ఈ ధైర్యం అంతా వాళ్లకు సినిమా ఇచ్చిందే. ధైర్యే సాహసే లక్ష్మీ అవుతుందా? చూడాలి.