ప్రభాస్ లేని బాహుబలి ప్రీక్వెల్?

బాహుబలి సినిమాకు ప్రీక్వెల్ నిర్మించే ఆలోచన వుందట. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ వెల్లడించారు. అయితే ఈ ప్రీక్వెల్ అంతా కొత్తవారితో నిర్మిస్తారట. దీనికి కూడా భారీ సెట్ లు వుంటాయట. ఇప్పటికే…

బాహుబలి సినిమాకు ప్రీక్వెల్ నిర్మించే ఆలోచన వుందట. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ వెల్లడించారు. అయితే ఈ ప్రీక్వెల్ అంతా కొత్తవారితో నిర్మిస్తారట. దీనికి కూడా భారీ సెట్ లు వుంటాయట. ఇప్పటికే ఓసారి వేసిన మాయిష్మతి సెట్ లాంటివి కూడా వాడతారట.

ప్రీక్వెల్ అంటే బాహుబలి పార్ట్ వన్ కన్నా ముందు కథ అన్నమాట. అంటే బాహుబలి తండ్రీ కొడుకుల్ని చూపించారు. ఇప్పుడు తాతను చూపిస్తారని అనుకోవాలి. మరి తాతగా ప్రభాస్ కాకుండా కొత్త వాళ్లు అంటే ఎవర్ని పట్టుకుని వస్తారో? అసలు ఈ సినిమా కూడా రాజమౌళి చేస్తారా? ఇంకెవరైనా నా? ఈ విషయాలు ఏవీ ఇంకా క్లారిటీగా చెప్పలేదు. ఇదంతా మరో మూడేళ్ల ప్రాజెక్టు అంట.

అంటే దీని వెనుక ఏదో పెద్ద కథే వుండి వుండాలి. అయినా ప్రభాస్, రాజమౌళి కాకుండా బాహుబలి అంటే దానికి ఆసక్తి వుంటుందా? ఏమో?

అయినా బాహుబలి నిర్మాతలు చెబుతున్నదానిని బట్టి చూస్తుంటే, భారీగానే ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. మూడేళ్ల పాటు నిర్మాణం అంటున్నారు. మరి ప్రస్తుతం చేయబోయే సినిమా తరువాత రాజమౌళి దీన్ని సూపర్ వైజ్ చేస్తారో లేక వేరే వాళ్లకు అప్పగిస్తారో? కాస్త ఆసక్తికరంగానే వుండేలా వుంది వ్యవహారం.