మహానటి సావిత్రి జీవితానికి, మరో మహానటి శ్రీదేవి జీవితానికి చాలా దగ్గర పోలికలు వున్నాయి. ఇద్దరూ తెలుగు, తమిళ భాషల్లో అమిత ప్రజాదరణ పొందినవారే. ఇద్దరూ అప్పటికే పెళ్లయినవారిని చేసుకున్నవారే. అన్నింటికీ మించి ఇద్దరూ ఎలాంటి పాత్రనైనా పండించగల మహానటులే.
అందుకే అలాంటి మహానటి సావిత్రి జీవితం మీద నిర్మిస్తున్న మహానటి బయోపిక్ ను నేడు మరణించిన మహానటి, అందాల హీరోయిన్ శ్రీదేవికి అంకింతం ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. శ్రీదేవితో నిర్మాత అశ్వనీదత్ కు మంచి అనుబంధం వుంది. మంచి సినిమాలు తీసారు కూడా ఆమెను హీరోయిన్ గా పెట్టుకోని.
అందుకే అన్ని విధాలా బాగుంటుందన్న సజెషన్లు అశ్వనీదత్ కు అందాయట. దానికి ఆయన కూడా పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. ఓ మహానటి జీవితగాధ సినిమాను మరో మహానటికి అంకితం ఇవ్వడం అన్నది నిజంగా సముచిత నిర్ణయమే అవుతుంది.