మహానటి.. అప్పుడే కాదు?

తెలుగు, తమిళ, మలయాళీ నటులందరినీ పోగేసి, వీళ్లు వాళ్లు అని లేకుండా బోలెడంత స్టార్ కాస్ట్ తో తయారవుతున్న సినిమా మహానటి. తెలుగు నాట బయోపిక్ లు అచ్చి వస్తాయో, రావో ఈ సినిమాతో…

తెలుగు, తమిళ, మలయాళీ నటులందరినీ పోగేసి, వీళ్లు వాళ్లు అని లేకుండా బోలెడంత స్టార్ కాస్ట్ తో తయారవుతున్న సినిమా మహానటి. తెలుగు నాట బయోపిక్ లు అచ్చి వస్తాయో, రావో ఈ సినిమాతో తేలిపోతుంది.

కేవలం తెలుగు కుటుంబాల్లో సావిత్రి మీద వున్న అభిమానం ఆసరాగా ఈ సినిమా చేస్తున్నారు. కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరి రికవరీ ఏ మేరకు అన్నది విడుదలయ్యాక సంగతి. అయితే తమిళ, మళయాల వెర్షన్లు వున్నాయి కాబట్టి ధైర్యంగా ఖర్చు పెడుతున్నారు. మూడు వెర్షన్లు, శాటిలైట్ లు, ఇవన్నీ బాగానే వస్తాయని అంచనా.

అయితే ఈ సినిమాను మార్చి నెలాఖరులో విడుదల చేస్తాం అని టీజర్ సాక్షిగా చెప్పారు. కానీ వాయిదా తప్పదని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. కానీ ఆ వెంటనే ఖండన కూడా వచ్చింది. సమస్య లేదు. మార్చి నెలాఖరులో పక్కా అని.

అయితే వినిపిస్తున్న వార్తల ప్రకారం మహానటి చెక్కుడు చాలా వుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్-ఎఎన్నార్ ఎపిసోడ్ లు ఇంకా చిత్రీకరించలేదు. దీనికి తోడు స్క్రిప్ట్ లో మార్పులు చేసి, మరి ఒకటి రెండు పాత్రలు జోడిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల అదనపుఖర్చు, అదనపు షూటింగ్ టైమ్. ఇవన్నీ అలా వుంచితే గ్రాఫిక్స్ రెడీ కావాల్సి వుంది. సినిమాకు కీలకం అవుతుందని భావిస్తున్న మాయాబజర్ ఘటోత్కచుడి సీన్ కు గ్రాఫిక్స్ చాలా ముఖ్యం. అవన్నీ ఇంకా పెండింగ్ లోనే వున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద చూసుకుంటే మహానటి ఈ సమ్మర్ ను వాడుకుంటుందా? మిస్ చేసుకుంటుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.