ఈ మధ్య వరుసపెట్టి భాగమతి, తొలిప్రేమ, ఇంటిలిజెంట్, గాయత్రి సినిమాలు విడుదలయ్యాయి. అన్నింటికీ థమనే సంగీత దర్శకుడు. దేవీశ్రీప్రసాద్ రెండు కోట్లకు పైగానే రెమ్యూనిరేషన్ కోరడం, అనూప్ రూబెన్స్ తరచు విపలం అవుతుండడం, మిగిలిన వారు ఎవ్వరూ సరిగ్గా సెట్ కాకపోవంతో, జనం దృష్టి మళ్లీ థమన్ వైపు మళ్లింది.
పైగా ఈమధ్య థమన్ చాలా వరకు బాగానే చేస్తున్నాడు. అన్నింటికి మించి జస్ట్ యాభై లక్షల రేంజ్ లో వున్నాడు. దాంతో చాన్స్ లు బాగానే వస్తున్నాయి.
ఇలాంటి టైమ్ లో త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా చాన్స్ కూడా వరించింది. ఈ సినిమాకు కూడా సైన్ చేసి అడ్వాన్స్ అందుకున్నాడు. అయితే చిన్న సవరణ ఏమిటంటే, ఈ సినిమా దగ్గర నుంచి మళ్లీ కాస్త రేటు పెంచాడు.
మరీ ఎక్కువగా కాదు, జస్ట్ ఇరవైలక్షల పెంచి 70లక్షలకు చేరుకున్నాడు. వాస్తవానికి ఒకప్పుడు ఇంతకన్నా ఎక్కువే తీసుకున్నాడు కానీ, మధ్యలో డౌన్ అయినపుడు తగ్గాడు. ఇప్పుడు మళ్లీ రేటు పెంచాడు అన్నమాట.
అయితే దేవీశ్రీప్రసాద్ తో పోల్చుకుంటే థమన్ బెటర్ నే. బ్యాక్ గ్రౌండ్ బాగా చేస్తాడు. కనీసం రెండు పాటలన్నా హిట్ చేస్తాడు. అది చాలు సినిమాకు. బడ్జెట్ లో కోటిన్నకు పైగా తేడా రావడానికి కూడా అవకాశం వుంటుంది.