Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రంగస్థలం టైటిల్ సాంగ్ రెడీ టు రిలీజ్

రంగస్థలం టైటిల్ సాంగ్ రెడీ టు రిలీజ్

రంగస్థలం తొలిపాట విడుదలయింది. అన్ని నెట్ ఫ్లాట్ ఫారమ్ లు కలిసి ఏడెఎనిమిది మిలియన్ల హిట్ లు సాధించింది. ఇప్పుడు రెండో పాటకు విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. ఈసారి రంగస్థంల టైటిల్ సాంగ్ విడుదల చేస్తారు. అది కూడా మరో వారం రోజుల తరువాత అంటే మొదటి పాట విడుదలయిన సరిగ్గా రెండు వారాలకు అన్నమాట.

ఈసారి రంగా.. రంగస్థలాన అంటూ సాగే టైటిల్ సాంగ్ ను విడుదల చేస్తారు. ఈ పాట విడుదలతో పాటు, చరణ్ అభిమానుల కోసం ఓ స్మాల్ సర్ప్రయిజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట విడుదల తరువాత పది రోజులకు అంటే మార్చి మూడు ప్రాంతంలో టోటల్ జ్యూక్ బాక్స్ ను వదిలేసి 18న విశాఖలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రెడీ అయిపోతోంది రంగస్థలం టీమ్.

మరోపక్క ఈ నెల 25 నాటికి టొటల్ మూవీ ఎడిటింగ్, డిఐ, తదితర పనులన్నీ పూర్తి చేసుకుని, రీరికార్డంగ్ కు ఇచ్చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అప్పటికి ఇంకా నెలకు పైగా టైమ్ వుంటుంది విడుదలకు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?