మహానాయకుడు ఎఫెక్ట్.. ఊపిరి పీల్చుకున్న తేజ

ఎన్టీఆర్-కథానాయకుడు వచ్చింది. అట్టర్ ఫ్లాప్ అయింది. తాజాగా ఎన్టీఆర్ మహానాయకుడు వచ్చింది. ఇది డిజాస్టర్లకే డిజాస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా దెబ్బకు నందమూరి కాంపౌండ్ మొత్తం డీలా పడిపోయింది. నిన్న జరిగిన 118 మూవీ…

ఎన్టీఆర్-కథానాయకుడు వచ్చింది. అట్టర్ ఫ్లాప్ అయింది. తాజాగా ఎన్టీఆర్ మహానాయకుడు వచ్చింది. ఇది డిజాస్టర్లకే డిజాస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా దెబ్బకు నందమూరి కాంపౌండ్ మొత్తం డీలా పడిపోయింది. నిన్న జరిగిన 118 మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో బాలయ్య ముఖం మొత్తం పాలిపోయింది. సినిమా పరాజయం అతడి ముఖంలో స్పష్టంగా కనిపించింది. మరోవైపు ఫ్యాన్స్ కూడా నిరాశచెందారు. 

ఇంత నెగెటివ్ వైబ్రేషన్స్ మధ్య కూడా పండగ చేసుకుంటున్న వ్యక్తి ఒకరున్నారు. అతడే దర్శకుడు తేజ. అవును.. మహానాయకుడు డిజాస్టర్ తో గట్టిగా ఊపిరిపీల్చుకున్నాడు దర్శకుడు తేజ. ఓ డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాననే ఆనందం అతడి కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కళ్లల్లో కనిపించడం కాదు, అదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద కూడా చెప్పి సరదా పడుతున్నాడు తేజ.

లెక్కప్రకారం, ఎన్టీఆర్ బయోపిక్ ను తేజ డైరక్ట్ చేయాలి. గ్రాండ్ గా జరిగిన ఈ సినిమా ఓపెనింగ్ తేజ కనుసన్నల్లోనే జరిగింది. ఆరోజు సెట్ ఎలా ఉండాలి, బాలయ్య గెటప్ ఎలా ఉండాలి, ఏ పాత్ర ఎవరు పోషించాలి, ఏ డైలాగ్ చెప్పాలి లాంటి అంశాలన్నీ తేజ దగ్గరుండి చూసుకున్నాడు. అలా అంగరంగ వైభవంగా సినిమా లాంఛ్ అయిన తర్వాత తేజ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.

బయోపిక్ కు సంబంధించి బాలయ్య పెట్టిన కండిషన్లు తేజకు నచ్చలేదు. పైపెచ్చు స్వయంగా బాలయ్య నిర్మాత కూడా కావడంతో తేజ మాట అస్సలు చెల్లలేదు. తన మనసుకు నచ్చని పని తేజ చేయడు. ముక్కుసూటిగా ఉండే ఈ డైరక్టర్.. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి హుందాగా తప్పుకున్నాడు. ఆ తర్వాత ప్రాజెక్టులోకి క్రిష్ ఎంటరయ్యాడు.

క్రిష్ ఎంటరైన తర్వాతే బయోపిక్ రెండు ముక్కలైంది. పార్ట్-1, పార్ట్-2గా చేయాలన్న ఆలోచన క్రిష్ దే. అంతేకాదు, తేజ రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా మారిపోయింది. బాలయ్య కలలుగన్న గెటప్స్ అన్నింటికీ నిడివి దక్కింది. ఇలా బాలయ్యను బాగానే తృప్తిపరిచిన క్రిష్, ప్రేక్షకుల్ని మాత్రం తృప్తిపరచలేకపోయాడు. ఫలితంగా రెండు భాగాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అలా ఓ భారీ డిజాస్టర్ నుంచి తేజ తృటిలో తప్పించుకున్నాడు.