కమాన్ ఆర్జీవీ.. ఇంతకంటే మంచి టైమ్ దొరకదు

ఈమధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ తీసిన ఏ సినిమాకు ఇంత బజ్ రాలేదు. క్రేజ్ సంగతి పక్కనపెడితే, రామ్ గోపాల్ వర్మ సినిమా రిలీజ్ కు ఇంత మంచి టైమ్ కూడా గతంలో…

ఈమధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ తీసిన ఏ సినిమాకు ఇంత బజ్ రాలేదు. క్రేజ్ సంగతి పక్కనపెడితే, రామ్ గోపాల్ వర్మ సినిమా రిలీజ్ కు ఇంత మంచి టైమ్ కూడా గతంలో ఎప్పుడూ సెట్ అవ్వలేదు. అవును.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. నిజానికి ఎన్టీఆర్-మహానాయకుడు సినిమా హిట్ అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఇంత క్రేజ్ వచ్చి ఉండేదికాదు. మహానాయకుడులో అన్నీ అవాస్తవాలు, అభూత కల్పనలు ఉన్నాయనే విషయాన్ని ప్రేక్షకులు రిలీజ్ కు ముందే గమనించారు. అందుకే మొదటిరోజే తిప్పికొట్టారు. వాళ్లంతా ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. పైగా ఎన్నికల సీజన్. ఇది ఆర్జీవీకి కలిసొచ్చే అంశం.

ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో జరిగిన సంఘటనలు, అతడు ఎదుర్కొన్న ఆటుపోట్లను ఉన్నది ఉన్నట్టుగా (నో ఫిల్టర్స్) చూపించగలిగితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కచ్చితంగా క్లిక్ అవుతుంది. ఓవర్గం ఈ సినిమాను వ్యతిరేకించే అవకాశం ఉన్నప్పటికీ.. కామన్ ఆడియన్స్ ఈ సినిమా ద్వారా నిజానిజాలు తెలుసుకుంటారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కూడా అభూతకల్పనలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్ని బసవతారకం కోణంలో చెప్పినట్టుగానే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను కూడా టైటిల్ కు తగ్గట్టు లక్ష్మీపార్వతి కోణంలో చూపించబోతున్నారు. కాబట్టి ఎన్టీఆర్ కుటుంబ జీవితానికి సంబంధించిన కొన్ని కోణాల్ని వక్రీకరించే అవకాశం ఉంది. కాకపోతే ఆ టైమ్ లో ఎన్టీఆర్ కుటుంబంలో వచ్చిన కలతలు, చీలికల్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఉన్నది ఉన్నట్టుగా చూడొచ్చు. వీటితో పాటు వెన్నుపోటు ఉదంతాన్ని కూడా యాజ్ ఇటీజ్ గా చూపిస్తారనే విషయం ట్రయిలర్ తోనే అర్థమైంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ ఏదో మూల ప్రేక్షకుల్లో అనుమానాలు తొంగిచూస్తూనే ఉన్నాయి. దీనికి కారణం కూడా కేవలం రామ్ గోపాల్ వర్మ మాత్రమే. ఈ దర్శకుడు ట్రయిలర్ లోనే సినిమా చూపిస్తాడు తప్ప, థియేటర్ కు వెళ్లిన తర్వాత సినిమాలో మేటర్ చూపించడు. ఈయన గత సినిమాల్ని పరిశీలిస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమౌతుంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ను కూడా వర్మ ఇలానే తీసినట్టయితే.. ఈ సినిమా నుంచి మనం ఏదీ ఆశించనక్కర్లేదు. ప్రేక్షకులకు మరోసారి భంగపాటు తప్పదు. కథానాయకుడు, మహానాయకుడు సినిమాల సరసన లక్ష్మీస్ ఎన్టీఆర్ ను కూడా చేర్చవచ్చు. మరి ఆర్జీవీ ఈసారి ఏం చేయబోతున్నాడు? లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మనసు పెట్టి తీశాడా? లేదా ఎప్పట్లానే కేవలం కెమెరా యాంగిల్ ఫిక్స్ చేసి తీశాడా?

జనసేనలో ఇప్పుడేం జరుగుతోంది?

చూడు ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు..