మహర్షి? ఎవరికి లాభం?

కోర్టులో గెలిచిన వాడు ఇంట్లో ఏడుస్తాడు. ఓడినవాడు బయట ఏడుస్తాడు అని సామెత. భారీ సినిమాలు చేసే నిర్మాతల పరిస్థితి ఇదే. భారీ సినిమా తీసాం, భారీ ఓపెనింగ్స్, భారీ కలెక్షన్లు చూపించడం. ఇన్…

కోర్టులో గెలిచిన వాడు ఇంట్లో ఏడుస్తాడు. ఓడినవాడు బయట ఏడుస్తాడు అని సామెత. భారీ సినిమాలు చేసే నిర్మాతల పరిస్థితి ఇదే. భారీ సినిమా తీసాం, భారీ ఓపెనింగ్స్, భారీ కలెక్షన్లు చూపించడం. ఇన్ కమ్ టాక్స్ వాళ్లకి లెక్కలు తయారుచేసుకోవడంతో సరిపోతుంది. సినిమా పోతే మరీ ఘోరం. హిట్ అయితే నాలుగు అయిదుకోట్లు కూడా మిగలదు.

లేటెస్ట్ గా మహేష్ సినిమా మహర్షి వ్యవహారం ఇలాగే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ ఓ రేంజ్ లో వుంది. నిర్మాతలు ముగ్గురు. అంటే లాభాలు వస్తే పంచుకుంటే తిలాదానం తలా పిడికిడు అన్నట్లు వుంటుంది వ్యవహారం. వంశీ పైడిపల్లి సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ అని టాక్ వుంది. ఊపిరి సినిమా అంత హిట్ అయినా నిర్మాతకు మిగిలింది లేదు.

ఇప్పుడు కూడా మహేష్ సినిమాకు ఆన్ పేపర్ వేసుకున్న బడ్జెట్ అక్షరాలా 120 కోట్లు. మహేష్, డైరక్టర్ రెమ్యూనిరేషన్, పబ్లిసిటీతో కలిపి. దీనికి ఓ రూపాయి ఎక్కువే అవుతుంది కానీ, తగ్గదు. మరి సినిమా టర్నోవర్ ఎంత రావచ్చు?

భరత్ అనే నేను ఫుల్ హైప్ వచ్చిన సినిమా, సూపర్ కాంబినేషన్. దాని టర్నోవర్ నే అంతాకలిపి 140కోట్లు. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రేంజ్ లో వుంటుంది కానీ, మరీ దాన్ని దాటేస్తుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే సీడెడ్, నైజాం, వెస్ట్ తదితర ఏరియాల్లో లెక్కలు ట్రేడ్ సర్కిళ్లకు తెలుసు. అందువల్ల ఇప్పుడు భరత్ అనే నేనును మింజి బిజినెస్ చేస్తుందా అన్నది అనుమానం.

అంటే అప్పుడు మిగిలేది గట్టిగా 20కోట్లు. ముగ్గురు పార్టనర్ లు. అదే వంశీ పైడిపల్లి గత సినిమాల మాదిరిగా ప్లానింగ్ ఒకటి, ఎగ్జిక్యూషన్ ఒకటి అయి, బడ్జెట్ పెరిగితే..?