ఏడాదిన్నర ఓ ప్రాజెక్టు మీద కష్టపడిన తరువాత, డైరక్టర్ కూర్చో అంటే కూర్చుని, నిల్చో అంటే నిల్చుని, ఎలా అడిగితే అలా చేసిన తరువాత, నిర్మాత చేత వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టించిన తరువాత, సరైన ఫలితం రాకపోతే ఏ హీరోకి అయినా బాధగానే వుంటుంది. తరువాత సినిమాలకు లోటు ఉండకపోవచ్చు. మార్కెట్ కు ప్రోబ్లమ్ లేకపోవచ్చు. కానీ ఎక్కడ చిన్న నొప్పి వుండనే వుంటుంది.
సూపర్ స్టార్ అనిపించుకున్న మహేష్ బాబు పరిస్థితి ఇప్పుడు అదే అని వినికిడి. స్పైడర్ కలెక్షన్లు అమ్మకాల రేంజ్ లో లేకపోయినా, మరీ తీసికట్టుగా ఏమీలేవు. పండుగ కలిసివస్తోంది. అంతమాత్రం చేత అద్భుతాలు అని చెప్పడానికి లేదు. మొత్తం మీద ఫలితం మహేష్ బాబుకు పెద్దగా రుచించలేదు. దీంతో మహేష్ మూడ్ పాడయిందని తెలుస్తోంది.
లెక్క ప్రకారం కోద్ది రోజుల్లో మహేష్ లేటేస్ట్ సినిమా భరత్ అనే నేను తరువాతి షెడ్యూలు ప్రారంభం కావాల్సి వుంది. కానీ ఇప్పుడు వాయిదా వేయమని మహేష్ కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తన మూడ్ బాలేదని, కొద్దిరోజుల తరువాత స్టార్ట్ చేద్దామని మహేష్ కోరినట్లు తెలుస్తోంది. ఎలాగూ సంక్రాంతి బరిలోంచి తప్పుకున్నారు కనుక, ఇప్పుడు చకచకా పూర్తి చేయకపోయినా వచ్చిన సమస్య ఏమీలేదు. మహేష్ మూడ్ బాగున్నాకే చేసుకోవచ్చు.