సన్నీ పాటకు కోటి

ఐటమ్ సాంగ్ అని సింపుల్ గా అనేస్తారు కానీ, పాపం, నిజానికి మిగిలిన పాటల కన్నా దీనికే ఎక్కువ ఖర్చు అవుతుంది. సినిమాలో మిగిలిన పాటలకు జస్ట్ సెట్ కాస్ట్ లేదా ఔట్ డోర్…

ఐటమ్ సాంగ్ అని సింపుల్ గా అనేస్తారు కానీ, పాపం, నిజానికి మిగిలిన పాటల కన్నా దీనికే ఎక్కువ ఖర్చు అవుతుంది. సినిమాలో మిగిలిన పాటలకు జస్ట్ సెట్ కాస్ట్ లేదా ఔట్ డోర్ కాస్ట్ నే వుంటుంది. ఐటమ్ సాంగ్ కు అదనపు ఖర్చులు తప్పవు. మొన్నటికి మొన్న జైలవకుశలో తమన్నాకు 65లక్షలు ఇవ్వాల్సి వచ్చింది అయిటమ్ సాంగ్ కు. ఇప్పుడు లేటెస్ట్ గా గరుడ వేగ సినిమా కోసం సన్నీలియోన్ కు 50లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని తెలుస్తోంది.

సన్నీలియోన్ క్రేజ్ అలాంటిది మరి. అలా అని ఖర్చు అక్కడితో ఆగలేదు. ముంబాయిలో సెట్ వేయడం, అక్కడ వంద మంది డ్యాన్సర్లను తీసుకోవడం తప్పలేదు. దాంతో మళ్లీ అదో అదనపు ఖర్చు. యాభై లక్షలు బిల్లు. సో, టోటల్ గా రాజశేఖర్ హీరోగా నటిస్తున్న గరుడ వేగ సినిమాలో సన్నిలియోన్ అయిటమ్ పాటకు ఖర్చు అక్షరాలా కోటి రూపాయలు అన్నమాట. 

ఇప్పటి దాకా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు రూపొందించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, తొలిసారి కాస్త భారీ సినిమాను తలకెత్తుకున్నాడు. కాస్త యాక్షన్ ప్లస్ టెక్నాలజీ బ్యాక్ గ్రవుండ్ సినిమా కావడంతో ఖర్చు బాగానే అవుతోంది. దానికి ఈ అయిటమ్ కోటి అదనం అన్నమాట.